Tuesday, December 24, 2024

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం : జాతీయ డాక్టర్స్ డే పరస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపల్లి నలంద జూనియర్ కళాశాలలో పట్టణంలో ఉన్న ప్రముఖ డాక్టర్స్‌కు శాలువలు కప్పి, పూల మొక్కలను బహుకరించారు. ముఖ్య అతిధిగా మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మీ హాజరయ్యారు. బెస్ట్ మునిసిపాలిటీగా అవార్డు పొందిన సందర్భంగా ఆమెను ఘనంగా శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు డాక్టర్లను దేవుళ్లుగా భావిస్తారని, అటువంటి వారిని గౌరవించాలని అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభన సమయంలో డాక్టర్స్ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తాము చనిపోతూ ప్రజల ప్రాణాలను కాపాడారని అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు షేక్ దస్తగిరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో లయన్స్ సభ్యులు పల్లపోతూ శ్రీనివాస్, కూర శ్రీధర్, కొయ్యాడ నగేష్, మన్నెం జవహార్ రెడ్డి, లగడపాటి రమేష్, చెరకు శ్రీనివాస్, బిఆర్‌ఎస్ యూత్ నాయకులు జయరామ్ నాయక్, మునిసిపాలిటీ శానిటరీ ఇన్‌స్పెక్టర్ అశోక్ చౌహాన్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News