Thursday, December 26, 2024

యువతి కడుపులో 2 కిలోల తలవెంట్రుకలు

- Advertisement -
- Advertisement -

21 ఏళ్ల యువతి కడుపులో 2 కిలోల తలవెంట్రుకలను బెరెల్లి డాక్టర్లు తొలగించ గలిగారు. గత 16 ఏళ్లుగా ఆమె తల వెంట్రుకలను తింటుండటం అలవాటైంది. వైద్య పరంగా ఈ అలవాటును ట్రైకోఫేజియా లేదా రపుంజల్ సిండ్రోమ్ గా గుర్తించారు. ఈ తలవెంట్రుకలన్నీ కడుపులో చుట్టలుగా పేరుకు పోయాయి. కొన్ని చిన్నపేగులకు కూడా చుట్టుకున్నాయా. ట్రైకోఫేజియా అన్నది తీవ్రమైన మానసిక అనారోగ్యం. ఈ బాధితులు తమ తలవెంట్రుకలనే ఊడదీసుకుని తింటారు. ఈ బాధితురాలి కడుపులో పూర్తిగా తలవెంట్రుకలు గుట్టల్లా నిండాయి. సెప్టెంబర్ 20న ఆమెను కడుపు లోని తలవెంట్రుకల కట్టలను సిటి స్కాన్ ద్వారా కనుగొని సెప్టెంబర్ 26న ఆపరేషన్ ద్వారా తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News