ఎపిలోని బెజవాడలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అనుమా నాస్పద స్థితిలో మృతి చెందారు. డాక్టర్ డి.శ్రీనివాస్ (40) ఇంటి బయట ఉరేసుకోగా, ఇంటి లోపల శ్రీనివాస్ తల్లి రమణమ్మ (65), భార్య ఉషారాణి (38), ఇద్దరు పిల్లలు శైలజ (9), శ్రీహన్ (8) రక్తపు మడుగులో విగత జీవుల్లా కనిపించారు. ఆర్థోపెడిక్ నిపుణుడైన డాక్టర్ శ్రీనివాస్ విజయవాడలోని శ్రీజ ఆసుపత్రిని నిర్వహి స్తున్నారు. ఆయన తన కుటుంబంతో కలిసి గురునానక్ కాలనీలో నివాసం ఉంటున్నారు. కాగా, కుటుంబ సభ్యులను హత్య చేసిన తర్వాత, శ్రీని వాస్ ఇంటి ఆవరణలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. మంగళవారం ఉదయం పది గంటల తర్వాత ఈ ఘోరం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మంగళవారం ఉదయం శ్రీనివాస్ ఇంట్లో వారిని చూసినట్టు స్థానికులు చెబుతున్నారు. డాక్టర్ శ్రీనివాస్ నగరంలో శ్రీజ ఆర్థోపెడిక్ ఆస్పత్రిని నిర్వహించారు.
శ్రీనివాస్ కుటుంబ సభ్యుల గొంతు కోసి హతమార్చినట్టు అనుమానిస్తున్నారు. ఇంట్లోని గదుల్లో రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. ఆర్థిక సమస్యలతో ఆస్పత్రిని లీజుకు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక కుటుంబ సభ్యుల్ని హతమార్చి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని సిపి రామకృష్ణ పరిశీలించారు. డాగ్‌స్కాడ్, క్లూస్ టీం తనిఖీలు నిర్వహించాయి. కాగా, తన కారు తాళం తన అన్నకు ఇవ్వాలంటూ ఎదిరింటి వాళ్ల పోస్ట్‌బాక్స్‌లో డాక్టర్ శ్రీనివాస్ పేరిట ఓ లెటర్ లభ్యమైంది. దీంతో ఇది ఒక ఆత్మహత్య కేసు అయ్యి ఉంటుందని పోలీసులు ఒక అంచనాకి వచ్చారు. అర్థరాత్రి సమయంలో కుటుంబసభ్యులను చంపి, తెల్లవారుజామున శ్రీనివాస్ తానూ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని భావిస్తు న్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే శ్రీనివాస్ ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ చదివిన శ్రీనివాస్.. ఏడాది క్రితం శ్రీజ అనే ఆసుపత్రిని బెజవాడలో ప్రారంభించాడు.
ఆ ఆసుపత్రి సరిగా నడవడం లేదు. దీంతో ఆయన డిప్రెషన్‌లో వెళ్లారు. ఈ క్రమంలో ఆసుపత్రిని రెండు నెలల క్రితం మరొకరికి అప్పగించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, శ్రీనివాస్ చాలా సౌమ్యుడని, ఎవరితోనూ విభేదాలు లేవని, సంవత్సరం క్రితం శ్రీజ హాస్పిటల్ పేరుతో సొంతంగా హాస్పిటల్ ఏర్పాటు చేశాడు. కొంతకాలం హాస్పిటల్ సజావుగానే నిర్వహించినప్పటికీ అనంతరం హాస్పిటల్ నిర్వహణలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యా యని శ్రీనివాస్ స్నేహితులు చెబుతున్నారు. ఈ క్రమంలో సదరు హాస్పిటల్ నిర్వహణ కోసం ఎదురు పెట్టుబడి పెడుతున్నారన్నారు. కేవలం శ్రీని వాస్ ఆర్థిక ఇబ్బందుల వల్లనే చనిపోయి ఉంటాడని భావిస్తున్నామని, తల్లిని, భార్యను, పిల్లలను హత్య చేశాడంటే నమ్మకలేకపోతున్నామని అంటున్నారు.