Friday, December 20, 2024

వైద్యుల మత్తు దందా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీబ్యూరో: నిషేధిత డ్రగ్స్‌ను విక్రయిస్తున్న వైద్య దంపతుల్లో భార్యను నార్కోటిక్ బ్యూరో, రాజేంద్రనగర్ ఎస్‌ఓటి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వైద్యుడు విదేశాలకు వెళ్లడంతో అతడి కోసం పోలీసులు ఎదురుచూస్తున్నా రు. నిందితుల వద్ద నుంచి 57 ఫెంటనాయిల్ ఇంజక్షన్లు, రెం డు మొబైల్‌ఫోన్లు, రూ.6,08,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… మెహిదీపట్నం, ఆసిఫ్‌నగర్, ఎస్‌బిహెచ్ కాలనీ, ఖాన్ రెసిడెన్షీలో ఉంటున్న డాక్టర్ అషాన్ ముస్తఫా ఖాన్, డాక్టర్ లుబనా నజీబ్ ఖాన్ ఇద్దరు భార్యాభర్తలు. వీరు ఇద్దరు సమీన్ ఆస్పత్రిలో మత్తు వైద్యులుగా పనిచేస్తున్నారు. ఫెంటనాయిల్ ఇంజక్షన్లను ఆపరేషన్ తర్వాత పేయిన్ భరించలేని రోగులకు తక్కువ మొత్తంలో ఇస్తారు. దీనిని సమీర్ ఆస్పత్రిలో గమనించిన వైద్య దంపతులు దానిని పోర్టర్ యాప్ ద్వారా అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.

ఈ ఇంజక్షన్ ఒకటి హెరాయిన్ కంటే 50 రెట్లు, మార్ఫిన్ కంటే 100 రెట్లు ఎక్కువ మత్తు తీసుకున్న వారికి వస్తుంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన ఓ వ్యక్తి దీనికి బానిసగా మారాడు. అతడికి వైద్య దంపతులు పోర్టర్ యాప్ ద్వారా ఇంజక్షన్లను పంపిస్తున్నారు. ఈ సమాచారం టిఎస్‌నాబ్‌కు రావడంతో నెల రోజుల నుంచి వారిపై నిఘా పెట్టారు. ఈ క్ర మంలోనే డాక్టర్ ముస్తాఫా కువైట్ దేశానికి వెళ్లాడు. తిరిగి వ చ్చిన తర్వాత అరెస్టు చేసేందుకు పోలీసులు ఎదురు చూడగా బాధితుడి పరిస్థితి మరింత విషమంగా మారే అవకాశం ఉందని వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.

పోర్టర్ యాప్ ద్వారా తీసుకునే వ్యక్తి ఆర్డర్ ఇవ్వడంతో డెలివరీ బాయ్ వై ద్యు డు ఉంటున్న ఇంటికి వచ్చి నాలుగు వయల్స్ ఇంజెక్షన్లను తీ సుకుని బయలుదేరాడు. డెలివరీ బాయ్‌ను అనుసరించిన పోలీసులు ఇంజక్షన్లను డెలివరీ చేయగా అతడు ఇంజక్షన్లకు రూ. 17,500 గూగుల్ పే చేశాడు. వెంటనే పోలీసులు డెలివరీ బాయ్ పట్టుకుని విచారణ చేయగా వైద్య దంపతుల మత్తు దందా మొత్తం బయటపడింది. వెంటనే పోలీసులు వైద్యుల ఇం టిపై దాడి చేసి ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. వైద్యుడు ము స్తాఫా భార్య డాక్టర్ లుబ్‌నా నజీబ్ ఖాన్‌ను అరెస్టు చేశారు. రా జేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News