Monday, December 23, 2024

డాక్టర్ల జీవితాలు రాబోయే తరాలకు ఆదర్శవంతంగా ఉండాలి: డా. బండా ప్రకాష్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : సమాజ శ్రేయస్సు కోసం, ముదిరాజ్ జాతి కోసం, మన ప్రగతి ఎక్కడ ఉందన్న దానిపై మనం నిరంతరం సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని శాసనమండలి డిప్యూటీ చైర్మన్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డా. బండా ప్రకాష్ పేర్కొన్నారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ, ముదిరాజ్ డాక్టర్స్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని ఇంజనీర్స్ భవన్‌లో నిర్వహించిన ‘ముదిరాజు వైద్యుల ఆత్మీయ సమ్మేళనం’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బండా ప్రకాష్ మాట్లాడుతూ మొదటిసారిగా ముదిరాజ్ డాక్టర్స్ ఫోరం 2019 మార్చి మూడోవారంలో ప్రారంభించామన్నారు. సీనియర్ డాక్టర్లు చదువుకునే పిల్లలకు మార్గదర్శకులుగా వ్యవహారించాలని ఆయన సూచించారు.

డాక్టర్ల జీవితాలు రాబోయే తరాలకు ఆదర్శవంతంగా ఉండాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ కోరుకుంటుందన్నారు. మన సంస్కృతీ, సంప్రదాయాలు చరిత్రను త్రవ్వే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కేవల్ కిషన్, బండి సాయన్న, కృష్ణస్వామి, పోలీస్ కిష్టయ్య, సూరటి అబ్బయ్య లాంటి ముదిరాజ్ మేధావుల చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్, తెలంగాణ ముదిరాజ్ డాక్టర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డా. రమణ,ఉపాధ్యక్షుడు డా. అశోక్, డా.రవిప్రసాధ్, మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు డా. ప్రతిభ, డా.జగన్మోహన్, పల్లెబోయిన అశోక్, గుండ్లపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News