Wednesday, January 22, 2025

వైద్యుల నిర్లక్ష్యం.. తల్లి ఒడిలోనే పసివాడి మృతి

- Advertisement -
- Advertisement -

doctors Negligence 5-year-old died in In Jabalpur

భోపాల్ : ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు పట్టించుకోకపోవడంతో తల్లి ఒడిలోనే ఓ ఐదేళ్ల చిన్నారి కన్నుమూశాడు. మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. జబల్‌పూర్‌కు చెందిన సంజయ్ పాండ్రే దంపతుల ఐదేళ్ల కుమారుడి రిషి అనారోగ్యం పాలుకావడంతో బుధవారం స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. అయితే వైద్యులెవరూ అందుబాటులో లేక ఆస్పత్రి బయటే కూర్చున్నారు. కొన్ని గంటలు గడిచినా బాలునికి వైద్యం అందకపోవడంతో తల్లి ఒడిలోనే ఆ బాలుడు కన్నుమూశాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అయితే ఈ సంఘటనపై డ్యూటీ డాక్టర్ వివరణ అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ముందు రోజు తన భార్య ఉపవాసం చేయడంతో తాను ఆరోగ్య కేంద్రానికి ఆలస్యంగా వచ్చానని ఆయన చెప్పారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే జబల్‌పూర్ లోని మరో ఆరోగ్య కేంద్రంలో ఆర్థిక అక్రమాలు వెలుగు లోకి వచ్చాయి. ఓ వైద్య దంపతులు 70 మంది ఆయుష్మాన్ ఆ భారత్ కార్డు దారులను ఆస్పత్రికి బదులుగా హోటల్‌లో చేర్పించి చికిత్స అందించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఆ దంపతులు నకిలీ బిల్లులతో ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద అక్రమంగా డబ్బు పొందేందుకు ఈ స్కామ్‌కు పాల్పడ్డారు. ఆయుష్మాన్ భారత్ కార్డుదారులకు వారే కొంతమొత్తం చొప్పున డబ్బు చెల్లించి హోటల్‌లో అడ్మిట్ చేసినట్టు దర్యాప్తులో తేలింది. దీంతో ఆ డాక్టర్ జంటపై అధికారులు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News