Thursday, December 19, 2024

దుబ్బాక ప్రభుత్వాసుపత్రిలో మహిళకు అరుదైన ఆపరేషన్

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట జిల్లా, దుబ్బాక ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం ఒక మహిళకు అరుదైన ఆపరేషన్ నిర్వహించినట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం…స్థానిక వంద పడకల హాస్పిటల్‌లో కామారెడ్డి జిల్లా, భిక్కునూరు గ్రామానికి చెందిన బాచాగారి సుజాతకు గత రెండేళ్ల నుండి కడుపునొప్పితో బాధపడుతూ అనేక ఆసుపత్రులు తిరిగింది. ఇందుకు లక్ష రూపాయల వరకు ఖర్చు చేసుకుంది. ఇటీవల దుబ్బాక ఏరియా ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్ చేస్తారని తెలుసుకుని అడ్మిట్ అయింది. వెంటనే ఆమెకు అన్ని వైద్య పరీక్షలు చేయించి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేసి 3.7 కిలోల మల్టీఫుల్ ఫైబ్రాడ్ గడ్డతో పాటు గర్భసంచిని తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ ఆపరేషన్‌లో సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News