- Advertisement -
హైదరాబాద్: రైట్ టు హెల్త్ బిల్లును రాజస్థాన్ ప్రభుత్వం ఆమోదించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు చేపట్టారు. ఈ బిల్లుతో రాష్ట్రంలోని ఏ పౌరుడైనా ఎలాంటి చెల్లింపులు లేకుండానే ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులో అత్యవసర చికిత్స పొందవచ్చును. ఈ చట్టం తో రాజస్థాన్ ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్స్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని డాక్టర్లు ఆరోపిస్తున్నారు. దీనికి నిరసనగా ఓ మహిళా వైద్యురాలు పానీపూరి అమ్ముతూ నిరసన తెలిపింది. అనిత పుచ్కావాలీ అని పానీపూరి దుకాణం అని బోర్డు పెట్టి పానీపూరి బండి నడుపుతున్నారు. మరో వైద్యుడు పరాఠా సెంటర్ నడుపుతు నిరసన వ్యక్తం చేశారు.
- Advertisement -