Friday, December 20, 2024

20 లీటర్ల విసర్జకం కలిగిన మూత్రపిండాన్ని తొలగించిన వైద్యులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ, హైదరాబాద్ : నగరంలో దాదాపు 20 లీటర్ల మూత్రం నిలిచిపోయి సమస్యాత్మకంగా మారిన భారీ మూత్ర పిండాన్ని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెప్రాలజీ, యూరాలజీ వైద్యులు శస్త్ర చికిత్స చేసి విజయవంతంగా తొలగించారు. రోగి శరీరంలోని ఎడమ కిడ్నీ దాదాపు 90 సెంమీ మేరకు విస్తరించడంతో శరీరంలోని ఇతర భాగాలు సైతం పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 47 సంవత్సరాల వయస్సు కలిగిన ఆరోగికి పది సంవత్సరాలుగా పొట్ట విస్తీర్ణం పెరిగిపోతూ తరుచుగా నొప్పి వస్తుంది. దీంతో ఏఐఎన్‌యూ వైద్యులను సంప్రదించి సమస్యలను వివరించారు. దీంతో పరీక్షలు చేసి శస్త్రచికిత్స నిర్వహించారు.

ఈసందర్భంగా ఆసుపత్రి వైద్యులు సయద్ మహ్మద్‌గౌస్ మాట్లాడుతూ రోగికి ఇటీవల కాలంలో ఆకలి తగ్గిపోవడం, తరచుగా వాంతులు రావడం, కడుపులో విపరీతమైన నొప్పివంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రిలో చేర్చిన తరువాత రోగ నిర్దారణ పరీక్షలు చేయగా ఎడమవైపు కిడ్నీ పెరిగిపోయింది. శస్త్రచికిత్స ద్వారా మూత్ర పిండం తీసేవేసే ప్రక్రియ చేపట్టాం. దాదాపుగా 20 లీటర్ల మేరకు విసర్జితం కాకుండా నిలిచిపోయిన మూత్రాన్ని రోగి ఎడమ మూత్రం పిండం నుంచి తొలగించి ఆరోగ్యం కాపాడినట్లు వెల్లడించారు. ఈకీలక చికిత్సలో డా. రాజేష్, అమిష్‌తో పాటు నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News