Sunday, December 22, 2024

అరుదైన వ్యాధితో బాధపడుతున్న రోగి ప్రాణాలు కాపాడిన వైద్యులు

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో ః మెరుగైన చికిత్స అందించి మంచి ఫలితాలు పొందాలంటే సరైన సమయంలో రోగాన్ని గుర్తించడం ఎంతో అవసరం. అయితే అరుదైన లక్షణాలతో కూడిన వ్యాధుల విషయంలో సరైన సమయంలో గుర్తించడం అనే అంశం కొంత సంక్లిష్టంగా మారడంతో పలు సందర్బాల్లో ఆ వ్యాధి ప్రాణాంతకంగా మారుందని వైద్యులు పేర్కొంటున్నారు. వికారాబాద్ జిల్లా ఎన్నారం గ్రామానికి చెందిన సుమత్రి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నదని బంధువులు ఆస్టమ్ ప్రైమ్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు.

భోజనం తరువాత ఏర్పడే కడుపునొప్పితో పాటు వికారం, వాంతులు రావడం, కడుపు ఉబ్బరం, ఆకలి తగ్గిపోవడం, బరువు తగ్గడం, ఊపిరితిత్తులో నొప్పితో మొదలై గుండె పోటు వచ్చిందన్న రీతిలో ఎడమ చేతిలో తీవ్రమైన నొప్పి, ఆలసట వంటి లక్షణాలతో గత రెండు సంవత్సరాలు బాధపడుతోంది. పలువురు వైద్యులను సంప్రదించిన రోజు రోజుకు ఆరోగ్యం క్షీణించింది. గమనించిన ఆస్టర్ వైద్యులు అల్ట్రాసౌండ్ డాపర్ పరీక్షతో పాటు సిటి యాంజీయోగ్రపీ నిర్వహించి సిండ్రోమ్ సమస్య ఉందని గుర్తించారు.

వెంటనే శరీరానికి తక్కువ కోత పెట్టే లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స చేయాలని నిర్ణయం తీసుకుని డా. సృజన్‌కుమార్, బాల వికాస్, టి. నరేష్‌కుమార్‌రెడ్డి పర్యవేక్షణలో లాప్రొస్కోపిక్ సర్జరీ చేసి రోగిని ఆరోగ్య సమస్యల నుండి విముక్తి పొందడమే కాకుండా తదుపరి సిటి యాంజియోగ్రఫీ చేసి పూర్తిగా తగ్గిపోయిందని నిర్దారణ చేసి రోగి ప్రాణాలు కాపాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News