Wednesday, December 25, 2024

తీవ్రమైన కడుపునొప్పి: మహిళ ప్రాణాలు కాపాడిన వైద్యులు

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో ః నగరంలో 64 సంవత్సరాల మహిళ తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ రెనోవా ఆసుపత్రి వైద్యులను సంప్రదిస్తే ఆమెకు రక్త, అల్ట్రాసౌండ్ పరీక్షలు చేసిన అండాశయం వద్ద భారీ కణితి ఉందని నిర్దారించారు. అనంతరం యంఆర్‌ఐ, సిటిస్కాన్‌తో పాటు ఇతర పరీక్షలు నిర్వహించి కణితిని శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. ఈసందర్భంగా డా. పద్మావతి మాట్లాడుతూ మహిళలకు కడుపులో ఇలాంటి కణతులు సాధారణంగా చూస్తూ ఉంటామని, అత్యంత అరుదుగా మాత్రమే 05 కేజీల పరిణామం కలిగిన కణితులను కనుగొనడం జరిగిందన్నారు.

ఇలాంటి కణుతులు అండాశయం బాహ్య పొర వద్ద ఏర్పడి ఇతర అవయవాలపై కూడా తన ప్రభావం చూపుతున్న సందర్బాలలో ఇతర అవయవాలకు ఇబ్బంది లేకుండా వాటిని కాపాడుతూ కణితి తొలగించాల్సినరావడం కిష్టమైన ఆంశంగా మారుతుందన్నరు. అయినప్పటికి తమ వైద్య బృందం అత్యంత నైపుణ్యంతో కణితిని విజయవంతంగా తొలగించగలిగిందని వివరిస్తూ శస్త్ర చికిత్స అనంతరం రోగి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. రెనోవా లంగర్‌హౌజ్ వైద్యులు సంజయ్ యాదగిరి, గంగాధర్, ప్రదీప్ నేతృత్వంలో విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News