Wednesday, January 22, 2025

మానవత్వానికి వైద్యులు ఆదర్శంగా నిలవాలి

- Advertisement -
- Advertisement -

ఆపదలో ఉన్న రోగులను ప్రాణాలు కాపాడాలి
వైద్య విద్యనభ్యసించేందుకు పెద్ద సంఖ్యలో మహిళల ప్రవేశాలు
గాంధీ మెడికల్ కళాశాలకు ఎంతో గొప్ప చరిత్ర ఉంది
ఉమ్మడి రాష్ట్రంలో వైద్య విద్య ఎంతో నిర్లక్షానికి గురైంది
గాంధీ మెడికల్ కళాశాల గ్రాడ్యుయేషన్ దినోత్సవంలో మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించే వైద్యులుగా ఎదుగాలని, వైద్య విద్య చదువుతున్న వారిలో ఎక్కువగా మహిళలే ఉండటం మంచి మార్పుకు నిదర్శనమని ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం గాంధీ మెడికల్ కాలేజీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ దినోత్సవంలో పాల్గొని వైద్య విద్యలో తెలంగాణ అత్యంత వెనుకబడి ఉండేదని తెలంగాణ ఉద్యమం సమయంలో గాంధీకి వచ్చి దర్నాల్లో పాల్గొనేవాళ్ళమన్నారు. గాంధీ మెడికల్ కాలేజీకి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. 1954 ప్రైవేటు మెడికల్ కళాశాలగా ప్రారంభమై 1956లో ప్రభుత్వ మెడికల్ కాలేజీగా మారిందన్నారు. అదే విధంగా ఉస్మానియా, కాకతీయ మెడికల్ కాలేజీలు నిజాం కాలంలో ప్రారంభమయ్యాయని ఉమ్మడి ఏపీలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ రాలేదని విమర్శించారు.

ఉద్యమ సమయం 2008లో ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశామని నాడు అసెంబ్లీలో మాట్లాడుతూ 50 ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజీ తెలంగాణలో రాలేదు నిజాం కాలంలో ఏర్పాటు చేసినవి ఉండేవన్నారు. ప్రస్తుతం సమాజంలో ఎంతో మార్పు వచ్చిందని వైద్య విద్య కోసం మన పిల్లలు, ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్ళే అవసరం లేకుండా పోయిందన్నారు. ప్రతి లక్షకు 22 ఎంబీబీస్ సీట్లతో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని గర్వంగా చెబుతున్నాను. 8 పీజీ సీట్లతో రెండో స్థానంలో ఉందని ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలు చేసి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని తెలిపారు. భారతదేశంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఫీజులో తక్కువ, స్టిఫెండ్ విషయంలో ఎక్కువగా ఉన్న ఒకే రాష్ట్రమన్నారు. ఎంబిబిఎస్ ప్రవేశాల విషయంలో తీసుకునే ఫీజు రూ.10వేలు మాత్రమే స్టైఫండ్ విషయంలో పీజీ మొదటి ఏడాదిలో రూ. 58వేలు ఇస్తే, ఏపీ రూ. 50 వేలు, కర్ణాటక రూ. 45 వేలు, కేరళ రూ. 55 వేలు, తమిళనాడు రూ.48 వేలు ఇస్తుందని, వైద్యుల మీద చేసే పెట్టుబడి, భవిషత్తు కోసం సమాజం చేసే పెట్టుబడిగా సీఎం భావించినట్లు పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్ద నిబంధనల ప్రకారం రాష్ట్రంలో 48 వేల మంది వైద్యులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1, వైద్యుల ఉత్పత్తిలో నెంబర్ 1 తెలంగాణ దేశ ప్రజల వైద్య అవసరాలు తీర్చే శక్తిగా ఎదుగిందని 2014లో ఉన్న 2850 ఎంబిబిఎస్ సీట్లను 8515 ఎంబిబిఎస్ సీట్ల పెంచి గత ఏడాదిలో 3వేల మంది వైద్యులను నియమించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మీరంతా చేరాలని ఆహ్వానిస్తున్నామని సర్కార్ ఆసుపత్రుల్లో పని చేసే వారికి పీజీ లో రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించినట్లు పేద ప్రజలకు సేవ చేయాలి, మీ తల్లిదండ్రులతో పాటు అందరికీ మంచి చేయాలని సూచించారు. ప్రాణాలకు తెగించి సరిహద్దులో రక్షణగా ఉండే సైనికుడు, దేశానికి అన్నం పెట్టే రైతు, ప్రజల ప్రాణాలు కాపాడేది వైద్యుడు ఇవి గొప్ప వృత్తులని ప్రశంసించారు.

ఉమ్మడి పాలనలో 1183 పీజీ సీట్లు ఉంటే ప్రస్తుం 2890 పీజీ సీట్లు పెంచామని భవిష్యత్‌లో పీజీ సీట్లలో కూడా తెలంగాణా నంబర్ వన్ అవుతుందని ఎయిమ్స్ తరహాలో నగరం నలువైపులా నాలుగు టిమ్స్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. నిమ్స్‌లో రోబోటిక్ సర్జరీ తెచ్చాం అందుకే అక్కడ పీజీ చేయాలని విద్యార్థులు అనుకుంటున్నట్లు వరంగల్ హెల్త్ సిటీ, నాలుగు టిమ్స్ అటానమస్‌గా చేస్తున్నామని ఐటి హబ్, వాక్సిన్ హబ్, ఫార్మా హబ్ గా ఉన్న హైదరాబాద్ కొద్ది రోజుల్లోనే హెల్త్ హబ్ కాబోతుందని అభిప్రాయ పడ్డారు. విదేశాల నుండి చికిత్స కోసం హైదరాబాద్‌కు పెద్ద సంఖ్యలో వస్తున్నారని దేశంలోనే ఎక్కువ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ తెలంగాణలో జరుగుతున్నాయని చెప్పారు. ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ తో పాటు, ఇన్ఫర్టిలిటి సెంటర్ గాంధీలో ఏర్పాటు చేస్తున్నాం. ఈనెల 16న గాంధీలో సూపర్ స్పెషాలిటీ ఎంసిహెచ్ ప్రారంభిస్తామని కార్పొరేట్ ఆసుపత్రులతో పోటీ పడుతూ ప్రభుత్వ ఆసుపత్రులు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. డబ్బు ఏవిధంగానైనా సంపాదించవచ్చు ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడటమే మనందరికి ముఖ్యమని మానవత్వానికి నిదర్శనంగా మీరు నిలవాలి. గొప్ప డాక్టర్లుగా ఎదగాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News