Monday, December 23, 2024

మొబైల్ మింగిన బాలిక.. తర్వాత ఏమైందంటే

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: ఏదో విషయంలో తతల్లిదండ్రులతో గొడవపడిన ఒక 15 ఏళ్ల బాలిక ఆ కోపంతో తన సెల్‌ఫోన్ మింగేసింది. మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వెంటనే ఆ బాలికను గ్వాలియర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా సర్జరీ చేసి ఆమె పొట్టలో చేరుకున్న సెల్‌ఫోన్‌ను డాక్టర్లు విజయవంతంగా బయటకు తీశారు.

ఆ బాలిక మొబైల్ ఫోన్ మింగిన విషయం తెలుసుకున్న వెంటనే ఆమె తల్లిదండ్రులు భిండ్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన డాక్టర్లు వెంటనే గ్వాలియర్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సిఫార్సు చేశారు. దీంతో ఆ బాలికను గ్వాలియర్‌లోని జయ ఆరోగ్య ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆమెకు స్కానింగ్ నిర్వహించిన వైద్యులు ఆమె పొట్టలో మొబైల్ ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. వెంటనే ఆమెకు ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. దాదాపు గంటకు పైగా జరిగిన ఈ ఆపరేషన్ ద్వారా ఆమె పొట్టలో చిక్కుకున్న మొబైల్ ఫోన్‌ను బయటకు తీయగలిగారు.

ఆ ఆసుపత్రిలో ఇటువంటి ఆపరేషన్ జరగడం ఇదే మొదటిసారి. భిండ్ జిల్లా ఆసుపత్రి వైద్యులు వెంటనే ఆమెను గ్వాలియర్‌కు పంపడం వల్ల ఆ బాలిక ప్రాణాలు రక్షించుకోగలిగామని జయ ఆరోగ్య ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్‌కెఎస్ ధకడ్ తెలిపారు. తమ వైద్యులు సకాలంలో ఆపరేషన్ చేసి ఆ బాలిక పొట్టలో ఉన్న సెల్ ఫోన్‌ను బయటకు తీశారని, ఆ బాలిక ఇప్పుడు సురక్షితంగా ఉందని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News