Saturday, December 21, 2024

తెలంగాణ చైతన్య జ్వాల దొడ్డి కొమురయ్య

- Advertisement -
- Advertisement -

1944 ఆంధ్ర మహాసభ ఏర్పాటు, తెలంగాణ ప్రాంతం అంతా ఆంధ్ర మహాసభ నాయకత్వంలో గుండెలు మండి గ్రామాల్లో ప్రజలు ఒడిసెల, గుప్తలు మహిళలు కారంపొడి సంఘాన్ని ఏర్పరుచుకున్నారు. సంఘం అండతో గ్రామాల్లో ప్రజలు వెట్టిచాకిరి రద్దు కోసం ఉద్యమబాట పట్టారు. పన్నులు కట్టేది లేదని తిరుగుబాటు చేశారు. ఇది చూసిన దొరలు ఉద్యమాన్ని అణచడం కోసం అనేక ప్రయత్నాలు చేసే వారు. కడవెండి గ్రామస్థులు అయినా దొడ్డి కొమురయ్య, అన్న దొడ్డి మల్లయ్య గ్రామంలో గొల్ల, కురుమల నాయకుడు. దొరసాని వెట్టికి గొర్రెలను ఇవ్వద్దని గొర్ల కాపర్లును చైతన్యపరిచాడు. దొడ్డి మల్లయ్యతో పాటు అదే గ్రామానికి చెందిన మంగలి కొండయ్య, నరసయ్య ఎర్రం రెడ్డి మోహన్ రెడ్డి, నల్ల నరసింహులు అప్పుడున్న సంఘంలో చేరి గ్రామ నాయకులు అయినారు.

ఆధిపత్యానికి, అహంకారానికి, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా జరిగిన ‘తెలంగాణ సాయుధ పోరాటం’ మిగతా ప్రపంచ పోరాటాల కంటే భిన్నమైనది. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది. ఈ స్ఫూర్తే నియంత పోకడలను నిలువరించడానికి అవసరమైన భావజాలాన్ని అందించింది. అన్యాయం శృతి మించితే ఆయుధాలను ఎత్తించి, ధిక్కార స్వరాలై నిలదీసేలా చేసింది. నిజాం నిరంకుశ పాలనకు, దొరల పెత్తందారీ విధానానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంతో ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలనుకున్న మిలిటరీ పాలనకు ఎదురొడ్డి 4000 మంది కార్యకర్తలు అమరులైనారు. ఆ కోవలో అమరుడై, తెలంగాణ సాయుధ పోరాటానికి తొలి అమరత్వాన్ని ఇచ్చి స్ఫూర్తినిచ్చినవారే దొడ్డి కొమురయ్య. భూ సమస్యలపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగే విధంగా చేసింది.

తెలంగాణ ప్రజలను చైతన్య పరిచింది. బాంచెన్ దొరా నీ కాళ్లు మొక్కుతా అన్న బడుగు జీవుల చేత ఆయుధాలు పట్టించింది. అప్పటి నల్లగొండ జిల్లా జనగామ తాలూకాలోని విస్నూరు గ్రామంలో రాక్షతత్వానికి నిలువెత్తు నిదర్శనం అయినా విస్నూర్ దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి, అతని కొడుకు బాబుదొర వీరి ఆగడాలు అంతాఇంతా కాదు. 60 గ్రామాలకు అధిపతి ఈ నరరూప రాక్షసుడు నిజాంకు తొత్తులుగా ఉన్న దొరలు, పటేళ్లు, పట్వారీలు గ్రామాల్లో ప్రజలపై చేయని అఘాయిత్యం లేదు. విస్నూరు దగ్గరలో ఉన్న కడవెండి గ్రామాల రామచంద్రారెడ్డి తల్లి జానమ్మ జాగీర్దార్ కడవెండి ఊరులో దొరసాని చేసిన ఆగడాలు తక్కువ ఏమి కాదు. 20 ఎకరాలు కూడా లేని జానమ్మ దొరసాని అనతికాలంలో ఊరును అంత తన గుప్పిట్లో పెట్టుకుంది. జానమ్మ దొరసాని ప్రజల చేత దొర అని పిలిపించుకునేది. ఈ అణచివేత నుండి 1944 ఆంధ్ర మహాసభ ఏర్పాటు, తెలంగాణ ప్రాంతం అంతా ఆంధ్ర మహాసభ నాయకత్వంలో గుండెలు మండి గ్రామాల్లో ప్రజలు ఒడిసెల, గుప్తలు మహిళలు కారంపొడి సంఘాన్ని ఏర్పరుచుకున్నారు. సంఘం అండతో గ్రామాల్లో ప్రజలు వెట్టిచాకిరి రద్దు కోసం ఉద్యమబాట పట్టారు. పన్నులు కట్టేది లేదని తిరుగుబాటు చేశారు. ఇది చూసిన దొరలు ఉద్యమాన్ని అణచడం కోసం అనేక ప్రయత్నాలు చేసే వారు.

కడవెండి గ్రామస్థులు అయినా దొడ్డి కొమురయ్య, అన్న దొడ్డి మల్లయ్య గ్రామంలో గొల్ల, కురుమల నాయకుడు. దొరసాని వెట్టికి గొర్రెలను ఇవ్వద్దని గొర్ల కాపర్లును చైతన్యపరిచాడు. దొడ్డి మల్లయ్యతో పాటు అదే గ్రామానికి చెందిన మంగలి కొండయ్య, నరసయ్య ఎర్రం రెడ్డి మోహన్ రెడ్డి, నల్ల నరసింహులు అప్పుడున్న సంఘంలో చేరి గ్రామ నాయకులు అయినారు. ఇది మింగుడుపడని జానమ్మ దొరసాని వీళ్లను హతమార్చాలని పన్నాగం పన్నింది. ఈ కార్యక్రమంలో దొరసాని ఆగడాలకు వ్యతిరేకంగా ప్రజలు అంతా నిరసన ప్రదర్శన చేయాలని సంఘం నిర్ణయించింది.

1946 జులై 4 సంఘం పిలుపు అందుకొని కడవెండి గ్రామంలో ప్రజలు అంతా వీధుల గుండా ప్రదర్శన చేశారు. అప్పటికి దొరసానికి అండగా వచ్చిన విస్నూరు రామచంద్రారెడ్డి రౌడీలు కోడూరు దొర నరసింహారెడ్డి నాయకత్వం గడి నుండి ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపారు. కడుపులోకి తూట దిగడంతో కొమురయ్య అక్కడికక్కడే నేలకొరిగాడు. కొమురయ్య అన్న మల్లయ్య కాలుకు తూట దూసుకుపోయింది. లక్ష్మీనరసయ్య కొండయ్యలకు గాయాలయ్యాయి. కొమురయ్య మరణం చుట్టు పక్కల గ్రామాల ప్రజల్లో ఆగ్రహాన్ని రగిల్చింది. వేలాది మంది ప్రజలు ఎక్కడికక్కడ సంఘం అండతో గ్రామాలలో దొర గూండాలను తరిమికొట్టారు.

కొమురయ్య బలి దానం తెలంగాణ సాయుధ పోరాటానికి పురుడు పోసింది. సంఘం పిలుపుతో ప్రజలు సాయుధ మార్గం పట్టారు. కొన్ని ప్రాంతాలకు దేశ్‌ముఖ్‌లు ఉంటూ ప్రజలను రాచి రంపాన పెట్టినా దొరలను, వారి ఆధిపత్యాన్ని కూలదోశారు. ఈ పోరాటంలో 4000 నుంచి 5000 మంది అమరులయ్యారు. తెలంగాణ పోరాటంలో అసువులు బాసిన అమర వీరులను గుర్తించి, వారి త్యాగాలు భవిష్యత్ తరాలకు అందించే ట్యాంక్ బండ్‌పై విగ్రహాలు పెట్టాలి. వీరుల త్యాగాల చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చే విధంగా మేధావులు కవులు, కళాకారులు, సామాజిక శక్తులు, ప్రగతిశీల శక్తులు ఒత్తిడి తీసుకు రావాల్సిన అవసరం ఉంది. అప్పుడే దొడ్డి కొమురయ్యతో పాటు సాయుధ పోరాట అమరుల అందరికీ నిజమైన నివాళి.

దయ్యాల అశోక్
95508 89907

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News