Saturday, December 21, 2024

తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమరయ్య తొలి అమరుడని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలు జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. మంత్రి జగదీష్ రెడ్డి దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన మరణంలో ప్రజా చైతన్యానికి నాంది పలికిన మహనీయుడు దొడ్డి కొమరయ్య అని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఏనాడూ తెలంగాణ త్యాగధనులను లేకుండా చూడాలని 60 సంవత్సరాలు మనవాళ్లను మరుగున పడేశారని అలాగే రైతు సాయుధ పోరాట యోధులను స్మరించలేదని, తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్న తరువాత మహనీయులందరినీ గౌరవించుకుంటున్నామని దీనిలో భాగంగానే దొడ్డి కొమరయ్య వర్ధంతిని అధికారికంగా జరుపుకుంటున్నామని మంత్రి తెలిపారు.

కొమరయ్య మరణానికి ఒక ప్రత్యేకత ఉందని, మొదటగా గ్రంధాలయాల ఏర్పాటు ఉద్యమంలా మొదలుపెట్టి ప్రజలలో చైతన్యపరిచి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎదిరించే విధంగా ప్రజలను చైతన్యపరిచారని మంత్రి అన్నారు. దొరలు భూస్వాముల దౌర్జన్యానికి ఎదురు నిలిచి తన ప్రాణాలర్పించారని తన మరణం తరువాత ఉద్యమకారులు ఆయుధాలు పట్టడం మొదలుపెట్టారని, ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి ధీటుగా మనం కూడా ఆయుధాలు చేపట్టాలని పిలుపునిచ్చి నాయకత్వం వహించింది మన బిఎన్ రెడ్డి అని మంత్రి గుర్తు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కడివెళ్లి గ్రామంలో ఒక సాధారణ కురుమ కులానికి చెందిన గొర్రెల కపరుల కుటుంబంలో జన్మించిన కొమరయ్య ఒక మహోన్నత ఉద్యమానికి ఆంధ్రుడు అవడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమని అన్నారు.

తన 19 సంవత్సరాల వయసులోనే దొడ్డి కొమురయ్య భయపడకుండా ప్రజలు సమీకరించి ర్యాలీగా ముందు వరుసలో నడుస్తూ వస్తుండగా జరిపిన కాల్పుల్లో కొమురయ్య తన ప్రాణాలను విడిచారని మంత్రి అన్నారు. ఆయన స్పూర్తితోనే బాంచన్ దొర నుండి ప్రజలు బయటకు వచ్చారని ఆయన చిందించిన రక్తం వల్లనే తెలంగాణ సిద్ధించిందని మంత్రి అన్నారు. ఆయనను స్మరించడం, యోధులను తలచుకుంటూ, వారి త్యాగాలను తెలుపుతూ, దొడ్డి కొమరయ్య గురించి భావితరాలకు తెలపాలని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని మంత్రి అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకట్రావు, అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, సూర్యాపేట జడ్పిటిసి జీడి భిక్షం, మున్సిపల్ వైస్ ఛైర్మన్ పుట్టా కిషోర్, ఇంఛార్జ్ డిఆర్‌ఓ రాజేంద్ర కుమార్, పిడి కిరణ్‌కుమార్, జడ్పి సీఈఓ సురేష్, సిపిఓ వెంకటేశ్వర్లు, డిపిఓ యాదయ్య, డిఎఫ్‌ఓ సతీష్‌కుమార్, బీసీ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News