Thursday, January 23, 2025

దొడ్డి కొమరయ్య జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి : దత్తాత్రేయ

- Advertisement -
- Advertisement -

నాంపల్లి: తెలంగాణ సాయుధ పో రాట యోధులు, గొప్ప వ్యక్తిత్వం, ఈ ప్రాంతం ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్న దొడ్డికొమరయ్య జీవి త చరిత్రను విద్యార్థుల పాఠ్యంశాల్లో చేర్చాలని హరియానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఆయన అత్యంత దైర్యసాహసి, విరోచిత పో రాట ధీరుడు నాడు సమాజంలో అన్యాయాలు, దోపిడీలకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో గళమెత్తారన్నారు. ఈ మేరకు మంగళవారం రవీంధ్రభారతిలో రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ పక్షాన “దొడ్డి కొమరయ్య” వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసి ప్రసంగించారు. దొడ్డి కొమరయ్య నిజాం నిరంకుశపాలనకు, రజకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడి ప్రజల్లో ఉత్తెజా న్ని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అని ఘనంగా శ్లాఘించా రు.

ఆలాంటి ధీరుడు, సాహసవంతులు, పోరాట యోధుడి జీవిత చరిత్రను తరతరాలకు తెలియజేసేందుకు పాఠ్యంశాల్లో పొందుపర్చాలన్నారు. ప్రభుత్వపరంగా మహానీయులు, పోరాట యోధులను జీవిత చరిత్రను తెలియజేసేందుకు ప్రభుత్వపరంగా వర్ధంతి, జయంతి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర శాసనమండలి డిప్యూ టీ ఛైర్మన్ బండ ప్రకాశ్ మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య పోరాట పటిమ, ఉద్యమాలు నేటి తరం వారికి స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. తెలంగాణ యో ధుల గత ప్రభుత్వాలు తొక్కిపెట్టాయని, సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే మహనీయుల చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చేందుకు కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. సమాజంలో పేదల శ్రేయస్సు, అన్యాయాలను సహించలేకనే పోరాటాలను నిర్వహించారన్నారు.

నాటి దోపిడీ, పీడన, హింసలకు వ్య తిరేకంగా తన గొంతెత్తారని పేర్కొన్నారు. రాష్ట్ర శాసనమండలి సభ్యుడు, తెలంగాణ కురుమ సంఘం అధ్యక్షుడు యెగ్గె మల్లేశం, బిఆర్‌ఎస్ శాసససభ్యులు మల్లయ్య యాదవ్, జైపాల్ యాదవ్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు ఉపేందర్, రాష్ట్ర కురుమ సంఘం ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ, నాయకులు బురుగడ్డ నగేశ్, అరుణ్‌కుమార్, ఎక్కాల కన్న, రెక్కా ల కొండల్ రాజు, కొలుపు నరసింహా, సీనియర్ జర్నలిస్టు కళే అమరనాథ్, కె.శ్రీనివాస గ్రేటర్ కురుమ సం ఘం యువజన విభాగం సలహాదారు సాయికిరణ్‌కురుమ, మహిళా అధ్యక్షురాలు తమ్మగొండ బాలమణిలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News