Saturday, December 21, 2024

తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య

- Advertisement -
- Advertisement -

జగిత్యాల టౌన్: తెలంగాణ సాయుధ పోరాటం చేసి తన ప్రాణాలర్పించిన తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పోరాట పటిమ భావితరాలకు స్పూర్తి అని జగిత్యాల ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. దొడ్డి కొమురయ్య 76వ వర్దంతిని పురస్కరించుకుని మంగళవారం జగిత్యాల పట్టణంలోని విజయపురి కాలనీలో గల దొడ్డి కొమురయ్య విగ్రహానికి ఎంఎల్‌ఎ సంజయ్‌కుమార్ పూల మాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ భూమి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పెత్తాందారులు, జమిందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రాణాలర్పించిన పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూనే గొల్ల, కురుమల అభివృద్థిపై ప్రత్యేక శ్రద్ద చూపుతోందన్నారు. గొల్ల, కురుమల కుల వృత్తిని కాపాడేందుకు ప్రభుత్వం వేల కోట్లు వెచ్చించి గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు.

గొల్ల, కురుమలు అత్యధిక శాతం తమ కుల వృత్తితో పాటు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చి దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణను తీర్చిదిద్దారన్నారు. బడుగు, బలహీన వర్గాల పిల్లలకు కార్పోరేట్ స్థాయి విద్యను అందించేందుకు బిసి గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య పౌష్టికరమైన భోజనం అందిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోళి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ నరేష్, డిఇ రాజేశ్వర్, కౌన్సిలర్‌లు కూసరి అనిల్, పంబాల రామ్, కూతురు రాజేష్, కోరె గంగమల్లు, పిట్ట ధర్మరాజు, బిఆర్‌ఎస్ నాయకులు గిరి, పుల్ల గంగారాం, మహేష్, శ్రీనివాస్, రాజ్‌కుమార్, తాజొద్దిన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News