Wednesday, January 22, 2025

కెఫిన్‌తో టైప్ 2 డయాబెటిస్ రిస్కు తగ్గుతుందా ?

- Advertisement -
- Advertisement -

ఉదయం కళ్లు తెరవగానే కాఫీ వాసన చాలామందికి తగలవలసిందే. మనదేశంలో సగానికి సగం మందికి తెల్లారేసరికి కాఫీ పడాల్సిందేనని ఓ సర్వేలో తేలింది. కాఫీని ఇంతగా ఇష్టపడేలా చేసే రసాయనం కాఫీలోని కెఫీన్. కెఫీన్ మనల్ని ఉత్తేజితుల్ని చేస్తుంది. ఎనర్జీ కూడా వస్తుంది. దాంతో చురుగ్గా పనిచేయగలుగుతాం. టీ, చాక్లెట్, కోలా టేస్ట్, సాఫ్ట్ డ్రింక్స్, కొన్ని ఔషధాల్లోనూ కెఫిన్ ఉంటుంది.

ఈ నేపథ్యంలో రక్తంలో కెఫిన్ స్థాయిలు ఎక్కువగా ఉంటే శరీరంలో కొవ్వు తగ్గడమే కాక, టైప్ 2 డయాబెటిస్ రిస్కు కూడా తగ్గుతుందని తాజా పరిశోధన ప్రతిపాదించింది. ఈ అధ్యయనం మరింత పరిశోధన చేయవలసి ఉన్నప్పటికీ స్థూల కాయాన్ని ,టైప్ 2 డయాబెటిస్‌ను తగ్గించడానికి మున్ముందు కెలోరీ విముక్త కెఫీన్ కలిగిన డ్రింక్స్‌ను వినియోగించడానికి దారి తీస్తుందని పరిశోధకులు తమ అధ్యయనంలో వివరించారు. బిఎంజె మెడిసిన్ జర్నల్‌లో ఇది వెలువడింది. యూనివర్శిటీ ఆఫ్ ఎక్స్‌టెర్ కు చెందిన డయాబెటిక్స్, ఒబిసిటీ విభాగ సీనియర్ లెక్చరర్ డాక్టర్ కటారినా కోస్ ఈ పరిశోధనపై తన అభిప్రాయం వెలువరించారు.

ఈ పరిశోధన కాఫీ ఎక్కువగా తాగాలని సిఫార్సు చేయడం లేదని , అది ఈ పరిశోధన లక్షం కాదని ఆమె వివరించారు. కెలోరీ ఫ్రీ అయిన ఎలాంటి కెఫిన్ కూడిన పానీయాలైనా, సానుకూల ఫలితాలిస్తాయన్నారు. రోజూ 70 నుంచి 150 ఎంజి కెఫిన్ కలిగిన మూడు నుంచి ఐదు కప్పులు కాఫీ తాగితే టైప్ 2 డయాబెటిస్ రిస్కు తోపాటు , గుండె నాళాల జబ్బు తగ్గుతుందని ఇదివరకు వెలువడిన అధ్యయనం ఆధారంగా ఇప్పుడు కొత్తగా ఈ అధ్యయనం నిర్వహించినట్టు పరిశోధకులు వివరించారు.

ఈ పరిశోధన పెద్ద విశ్వాసం కలిగిస్తుందని పేర్కొన్నారు. యూనివర్శిటీ ఆఫ్ వార్‌విక్స్ మెడికల్ అసోసియేటెడ్ క్లినికల్ ప్రొఫెసర్ డాక్టర్ స్టీఫెన్ లారెన్స్ ఈ అధ్యయనం ఆసక్తికరంగా ఉందని, జన్యుపర సాక్షాల ఆధారంగా కెఫిన్ జీవక్రియ సాగడాన్ని ఆయన ఉదహరించారు. కెలోరీలు తీసుకోవడం తగ్గించడం భౌతిక చర్యలను పెంచడం కంటే ఇది మరింత ప్రభావంతంగా ఉండక పోవచ్చని అభిప్రాయపడ్డారు. ఇంతేకాక, కెఫిన్ వినియోగంతో గుండె కొట్టుకోవడం. దడదడ పెరుగుతుందని, ప్రతివ్యక్తికి ఇది అనుకూలం కాకపోవచ్చని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News