- Advertisement -
హైదరాబాద్ : రెండు నెలలుగా నాగ, కుకీ తెగల మారణహోమం కానసాగుతుంటే ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు మాట్లాడారని ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసి వ్యంగాస్త్రాలు సంధించారు. అక్కడి బిజెపి ప్రభుత్వం దీనిపై సమాధానం చెప్పాల్సి ఉండగా భయంకరమైన వీడియో బయటికి వచ్చిన తర్వాత ప్రధాని స్పందించారన్నారు. దీనిపై బిజెపి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. భయంకరమైన వీడియోపై మోడీ స్పందిస్తారా? అని అసదుద్దీన్ ప్రశ్నించారు. ఇప్పటి వరకు 160 మంది మృతి, అత్యాచారానికి గురైన అనేక మంది మహిళలు, నిర్వాసితులైన యాభై వేల మందికి మణిపూర్ బిజెపి ముఖ్యమంత్రి న్యాయం చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.
- Advertisement -