Monday, January 20, 2025

‘కల్కి 2898 ఏడి’ సినిమా అసలు చూడొచ్చా?…

- Advertisement -
- Advertisement -

వారంలో రూ.700 కోట్లు దాటేసిస ‘కల్కి 2898 ఏడి’ కలెక్షన్

హైదరాబాద్: ఈ సినిమా గురించి విశ్లేషించాలంటే… సినిమా కథ సామాన్యులకు అయోమయంగా ఉంటుంది. భారతంలోని అశ్వత్థామ, శ్రీకృష్టుడు, కర్ణుడు వంటి పౌరాణిక పాత్రలకు నవీన కాలం సైన్స్ అంశాలు జోడించి సినిమా తీశారు. దర్శకుడు అసలేమి చెప్పాలనుకుంటున్నది సామాన్యులకు అర్థం కాదు. ఈ సినిమాలో ఓ బుల్లి రోబో కూడా కీలకంగా ఉంటుంది. అశ్వత్థామ ‘చిరంజీవి’ అన్న ఓ కీ పాయింట్ అంశంతో కథ మొదలవుతుంది.

ఈ సినిమాలో అశ్వత్థామగా సీనియర్ నటుడు అమితాబ్ అదరగొట్టేశాడు. ఆయన ప్రతి బిట్ ఆకట్టుకుంటుంది. ఇకపోతే నటుడు ప్రభాస్ మామూలు స్థాయిలోనే నటించాడు. ‘సుప్రీం యాస్కిన్’ పాత్రలో కనిపించే కమల్ హాసన్ నటన ఓకే. కానీ ఆయనకు ఫుల్ స్కోప్ పాత్ర లేదు. అర్జునుడిగా నటించిన విజయ్ దేవరకొండ అయితే రెండు నిమిషాల పాత్రలో తళుక్కున మెరిసిపోతాడు. నటీమణుల విషయానికి వస్తే దీపిక పదుకొణె, అన్నాబెన్, దిశా పటానీ, శోభన, మృణాల్ ఠాకుర్, మాళవిక నాయర్…అంతా తమ తమ పాత్రల్లో అలరించారు. కాగా అతిథి పాత్రల్లో బ్రహ్మానందం, రామ్ గోపాల్ వర్మ, రాజేంద్ర ప్రసాద్, దుల్కర్ సల్మాన్, ఎస్.ఎస్. రాజమౌళి కనిపిస్తారు.

ఈ సినిమా తాలూకు సినిమాటోగ్రఫీ హాలివుడ్ సినిమాలను తలదన్నేదిగా ఉంది. విజువల్ వండర్ అనే చెప్పాలి. నటన, డైరెక్షన్ అంతా ఈ సినిమాకు ప్లస్ పాయింట్లు. అయితే సినిమా కథ… కథనం మాత్రం మెచ్చుకునే రీతిలో లేదు. పొంతన అనేది లేకుండా కథ సాగుతుంటుంది. అదే ఈ సినిమాకు అతి పెద్ద దెబ్బ. దీని రెండో భాగం కూడా రాబోతోంది. అందులోనైనా కథనం విషయంలో దర్శకుడు స్పష్టత పాటిస్తే బాగుంటుందనిపిస్తుంది.

నటుడు ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడి’ సినిమా వారం రోజుల్లో రూ. 700 కోట్లకు పైగా రాబడిని ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది. హిందీ మార్కెట్   మొదటి వారం కలెక్షన్స్ లో సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా(రూ. 152.5 కోట్లు) నిలిచింది. హిందీ సినిమా ‘ఫైటర్’ మొదటి స్థానంలో( రూ. 199.45 కోట్లు) ఉంది.

రేటింగ్ : 3.5/5

రివ్యూ: అశోక్

 

 

 

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News