Monday, January 20, 2025

బిసిని ముఖ్యమంత్రిగా ప్రకటించే దమ్ము కాంగ్రెస్ కు ఉందా? : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో బిసిని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించే దమ్ము కాంగ్రెస్ కు ఉందా? అని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నిగ్గదీశారు. గురువారం ఖైరతాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచార సభలో మాట్లాడుతూ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశమివ్వరని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలలకు ఓ ముఖ్యమంత్రి మారుతారని ఎద్దేవా చేశారు.

రాహుల్ గాంధీ, కాంగ్రెస్ బిసిలను అవమానించే విధంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణను సర్వనాశనం చేస్తుందని ధ్వజమెత్తారు. ఐదు నెలల క్రితం కర్ణాటకలో గెలిచి ఆ రాష్ట్రాన్ని అవినీతిమయం చేసిందన్నారు. బొగ్గు నుంచి హెలికాప్టర్ల వరకు కుంభకోణాలకు పాల్పడిన కాంగ్రెస్‌కు ప్రజలు ఈ ఎన్నికలో తగిన గుణపాఠం చెబుతారని వెల్లడించారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత క్వింటాల్‌కు రూ.1000 అదనంగా చెల్లించి రైతుల వద్ద నుంచి వడ్లు కొనుగోలు చేస్తామని వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News