Sunday, January 19, 2025

రష్మికను విజయ్ ప్రేమిస్తున్నాడా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నటుడు విజయ్ దేవరకొండ, నటి రష్మిక మందన్న ప్రేమించుకుంటున్నారా అన్నది స్పష్టం కావడం లేదు. కానీ పుకార్లు మాత్రం షికారు చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై మాత్రం వీరిద్దరూ ఎలాంటి స్పష్టతనివ్వడంలేదు. పైకి మాత్రం వారు ‘జస్ట్ ఫ్రెండ్స్’ అంటున్నారు. వీరు నటించిన సినిమాలు  గీతా గోవిందం(2018), డియర్ కామ్రెడ్(2019) విజయవంతం అయ్యాయి. వీరి అభిమానులు మాత్రం వీరిద్దరి మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్ షిప్పేనా, లేక ఇంకేదో ఉందా? అనుకుంటున్నారు. కానీ వారు మాత్రం వారి మధ్య ఉన్నది ప్రేమ లేక కేవలం ఫ్రెండ్షిప్పేనా అన్నది ధ్రువీకరించడం లేదు.

గలాటా ప్లస్ లో యాంకర్ ఇంటర్య్వూ చేసేప్పుడు ‘విజయ్ దేవరకొండ రిలేషన్షిప్ లో ఉన్నారా?’ అని అడిగినప్పుడు తెలివిగా, ‘ అవును ఉన్నాను, నా తల్లిదండ్రులతో, నా సోదరిడితో, మీతో, అందరితో సంబంధం కలిగి ఉన్నాను’ అని జవాబిచ్చాడు.

విజయ్ దేవరకొండ, నటి మృణాల్ ఠాకుర్ తో నటించిన ‘ది ఫ్యామిలీ స్టార్’ ఏప్రిల్ 5న విడుదల కానున్నది. ఆ సినిమా పనుల్లో విజయ్ తలమునకలుగా ఉన్నాడు. అయితే రష్మిక మందన్న సినిమా విడుదలకు ముందే ఆ సినిమా విజయవంతం కావాలని ట్వీట్ చేసింది. దానికి విజయ్ దేవరకొండ కూడా  ‘ క్యూటెస్ట్’ అంటూ స్వీట్ రిప్లయ్’ ఇచ్చాడు. కాగా రష్మిక నాలుగు సినిమాల్లో నటించబోతోంది. పుష్ప2, ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో, విజయ దేవరకొండ సినిమా విడి12లో…

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News