Thursday, January 23, 2025

కుల సర్టిఫికేట్ కోసం కుక్క దరఖాస్తు!?

- Advertisement -
- Advertisement -

గయా: బీహార్‌లోని గయాలో కుల ధృవీకరణకు విచిత్ర దరఖాస్తు వచ్చింది. టామీ అనే శునకానికి కుల ధృవీకరణ కోసం దరఖాస్తు చేశారు. అంతేకాదు…ఆ కుక్కకి ఆధార్ కార్డు కూడా ఉందండోయ్. దానిని కూడా జతచేశారు. అందులో టామీ తండ్రి పేరు షేరు, పుట్టిన తేదీ ఏప్రిల్ 14, 2022 అని ఉంది. ఇక చిరునామా పందేపోఖర్, పంచాయతీ రౌనా వార్డు నంబర్ 13, గురారు సర్కిల్ అని పేర్కొన్నారు.

పైగా ఆ ఆధార్ కార్డుపై ‘ఆమ్ కుత్తా కా అధికార్’ అని రాసి ఉంది. ఇప్పుడీ వార్త వైరల్‌గా మారింది. కాగా గురారు సర్కిల్ అధికారి సంజీవ్ కుమార్ ‘దరఖాస్తుపై పేర్కొన్న ఫోన్ నంబర్ ట్రూకాలర్‌లో రాజాబాబు అని చూపెడుతోంది’ అని తెలిపారు. అయితే అధికారులు మాత్రం ఈ విచిత్ర సంఘటనకు ఖంగు తిన్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News