Thursday, January 23, 2025

ఆరేళ్ల బాలికపై పెంపుడు కుక్క దాడి… 1000కిపైగా కుట్లు

- Advertisement -
- Advertisement -

పెంపుడు కుక్క దాడిలో ఆరేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలైన సంఘటన అమెరికాలోని చెస్టర్‌విల్లేలో చోటుచేసుకుంది. పన్నేండు గంటల పాటు చిన్నారికి వైద్యం చేసిన వైద్యులు ఆపరేషన్ లో 1000కి పైగా కుట్లు వేసినట్లు సమాచారం. అమెరికాలోని చెస్టర్‌విల్లేలో ఈ నెల 18న లిల్లీ అనే చిన్నారి తన స్నేహితురాలితో ఆడుకోవడానికి పక్కింటికి వెళ్లింది. ఇంట్లో టేబుల్‌ వద్ద కార్డ్స్‌ ఆడుకున్న సమయంలో ఆ కుటుంబ సభ్యులు పెంచుకుంటున్న పిట్‌బుల్‌ జాతికి చెందిన కుక్క ఒక్కసారిగా బాలికపై దాడి చేసింది. కుక్క పంటి గాట్లతో బాలికపై తీవ్రగాయాలయ్యాయి. లిల్లీతోపాటు అక్కడే ఉన్న ఆమె స్నేహితురాలు పెద్దగా అరవడంతో వంట చేస్తున్న తల్లి పరుగెత్తుకుని వచ్చి కుక్కను తరిమింది. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. హూటాహుటిన అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు చిన్నారిని బోస్టన్ చిల్డ్రన్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాపకు చికిత్స కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News