Sunday, December 22, 2024

చిన్నారిపై వీధి కుక్క దాడి..

- Advertisement -
- Advertisement -

నర్సాపూర్: కుక్క దాడిలో 7 సంవత్సరాల చిన్నారి తీవ్రంగా గాయపడిన ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..  మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ 6వా వార్డులో నివాసం ఉండే ముకాసిర్ అలీ సబ్  7 సంవత్సరాల కూతురు  నైళ ఇంటి దగ్గర నడుచుకుంటూ వెళుతున్న చిన్నారి పై  ఒక్కసారిగా కుక్క దాడి చేసింది.

ఈ ఘటనలో చిన్నారి భయాందోళనకు గురై  కుప్పకూలిపోయింది.  కుక్క  చిన్నారిపై దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. బాలిక కేకలు వేయడంతో, ఇంట్లో నుండి తల్లి,స్థానికులు  రావడంతో కుక్క పారిపోయాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికను కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News