Sunday, December 22, 2024

కుక్కలు బాబోయ్.. పిల్లలు జాగ్రత్త

- Advertisement -
- Advertisement -

బోధన్‌రూరల్ : మొన్నటికి మొన్న కుక్కల దాడిలో ఒక చిన్ని ప్రాణం చిదిమేసిన సంఘటన అందరికీ తెలిసిందే. రోడ్లపై చిన్న పిల్లలను వదిలి నమ్మలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. శనివారం బోధన్ మండలంలోని సాలంపాడు గ్రామంలో చిన్న పిల్లలను రోడ్డు బయట వదిలేసిన ఫోటో వారి దగ్గర నుంచి కుక్క వెళుతున్న దృశ్యాలు మన తెలంగాణ క్లిక్ చేసింది. పిల్లల తల్లిదండ్రులు తమ తమ పిల్లలను బహిరంగ ప్రదేశాలలో వదిలి నమ్మే పరిస్థితులు లేవు. ఇంత భయంకరమైన పరిస్థితి నెలకొన్నప్పటికీ పిల్లలను ఈ మేరా నిర్లక్షంతో రోడ్డుపై వదిలేయడం సమంజసం కాదు. పిల్లలు రోడ్డుపైకి వస్తున్న సమయంలో పెద్దలు ఎవరో ఒకరు వారి వెంబడి ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. పిల్లలను జాగ్రత్తగా ఉంచుకోవాలని అధికారులు సైతం హెచ్చరికలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News