Sunday, January 19, 2025

చిత్రపురి కాలనీలో మహిళపై కుక్కల దాడి

- Advertisement -
- Advertisement -

వీధి కుక్కలు ఓ మహిళపై దాడి చేసిన సంఘటన మణికొండలోని చిత్రిపురి కాలనీలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు మణికొండలోని చిత్రపురి కాలనీలో గతకొంత కాలం నుంచి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. అక్కడ ఉండే వారిని పలుమార్లు దాడి చేశాయి, దాడిలో పిల్లలు, పెద్దలు పలుమార్లు గాయపడ్డారు. ఈ క్రమంలోనే కారు పార్కింగ్ వద్ద స్కూటీపై వచ్చిన ఓ మహిళలపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15కుక్కలు ఒక్కసారిగా వచ్చి దాడి చేశాయి. కుక్కలను మహిళ వెళ్లగొట్టేందుకు ప్రయత్నం చేసినా కూడా అవి వెళ్లకుండా దాడి చేశాయి.

వాటి నుంచి తప్పించుకునేందుకు మహిళ అరగంట పాటు ప్రయత్నం చేసింది. అయినా కూడా దాడి చేయడంతో కిందపడిపోయింది. తర్వాత ఓ యువకుడు అక్కడికి రావడంతో కుక్కలను అక్కడి నుంచి తరిమేశాడు. గతంలో కూడా చిత్రపురి కాలనీలో తల్లీకుమారుడిపై వీధికుక్క దాడి చేయడంతో తీవ్రగాయాలపాలయ్యారు. దాడి చేసినప్పుడు హడావిడీ చేసిన జిహెచ్‌ఎంసి అధికారులు తర్వాత పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. వీధి కుక్కలను పట్టుకోవడం అధికారులు వదిలేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కాలనీలో నుంచి కుక్కలను తీసుకుని వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News