Friday, November 15, 2024

తెలంగాణలో మూడు రెట్లు పెరిగిన కుక్క కాట్ల కేసులు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ లోక్‌సభకు సమర్పించిన నివేదికలో 2022లో కుక్క కాట్ల కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఎనిమిదో స్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు. 2022లో తెలంగాణలో 80281 కుక్క కాట్లు రికార్డు అయ్యాయి. ఇది 2014లో 24000 ఉండింది. అంటే మూడు రెట్లు పెరిగాయి.

అయితే జిహెచ్‌ఎంసి వెటర్నీ వింగ్ అధికారులు కొవిడ్19 నిబంధనాల కారణంగా కుక్క కాట్ల కేసులను పెద్దగా పట్టించుకోలేదన్నారు. పైగా వారు హైదరాబాద్‌లోని వీధి కుక్కలలో 65 శాతం కుక్కలకు యానిమల్ బర్త్ కంట్రోల్(ఎబిసి) కింద స్టెరిలైజ్ చేసినట్లు పేర్కొన్నారు.

ఓ జిహెచ్‌ఎంసి అధికారి ‘సాధారణంగా హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ జనసమ్మర్ధం ఎక్కువ ఉన్న మున్సిపల్ ఏరియాలు. ఈ ప్రాంతాల్లో కుక్కలకు పెద్ద ఎత్తున స్టెరిలైజేషన్ చేస్తున్నాము. ఇప్పుడు కుక్కలు అంత తీవ్రంగా వ్యవహరించడం లేదు. కుక్క కాట్లు కూడా బాగా తగ్గాయి’ అని అన్నారు.

కుక్క కాట్ల రికార్డులో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. అక్కడ 3.4 లక్షల కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానాలలో తమిళనాడు(3.3 లక్షలు), ఆంధ్రప్రదేశ్ (1.69 లక్షలు), ఉత్తరాఖండ్(1.62 లక్షలు), కర్నాటక (1.46 లక్షలు), గుజరాత్ (1.44 లక్షలు), బీహార్‌లో 1.1 లక్షల కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News