Sunday, January 19, 2025

సిద్దిపేటలో కలెక్టర్‌ను కరిచిన కుక్క… ఐసియులో చికిత్స

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: కుక్కలు దాడి చేయడంతో కలెక్టర్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న సంఘటన సిద్దిపేట కలెక్టరేట్‌లో జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం…. సిద్దిపేటలో శ్రీనివాస్ రెడ్డి అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అధికారులు నివాసాలు కలెక్టరేట్‌తో పాటు సిద్దిపేట శివారులో ఉన్నాయి. శ్రీనివాస్ రెడ్డి తన నివాసంలోని ఆవరణంలో వాకింగ్ చేస్తుండగా వీధి కుక్క దాడి చేసింది. రెండు కాళ్ల పిక్కలు పీకడంతో అతడు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతడిని సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కలెక్టర్‌ను ఐసియులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం ఓ వ్యక్తిని, కలెక్టర్ పెంపుడు శునకాన్ని వీధి కుక్క కరిచింది. కలెక్టరేట్‌కు సమీపంలో కోళ్ల ఫామ్‌లో ఓ బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. ఎక్కువగా ఆ ప్రాంతంలో కుక్కలు తిరుగుతుండడంతో అధికారుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ లో కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన సంఘటన తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News