Wednesday, January 22, 2025

గద్వాల్ లో ఆరుగురుపై పిచ్చికుక్కల దాడి

- Advertisement -
- Advertisement -

గోనుపాడులో ఆరుగురుపై పిచ్చికుక్కల దాడి

ఆరుగురికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స

గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం గోనుపాడు గ్రామంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి.  ఆరుగురు వ్యక్తులపై పిచ్చి కుక్కలు దాడి చేశాయి. ఈ ఆరుగురిలో పెద్దలు చిన్నారులు ఉన్నారు. ఈరోజు ఉదయం ఇంటి ముందర ఉన్న చోటనే ఆరుగురుపై కుక్కలు కరవడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగురు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో పిచ్చికుక్కల దాడులను నివారించాలని సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని గోనుపాడు గ్రామస్తులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News