Monday, December 23, 2024

కరెన్సీ నోట్లను నమిలి మింగేసిన కుక్క!

- Advertisement -
- Advertisement -

పెంపుడు కుక్కే కదా అని తేలిగ్గా తీసుకుంటే కరెన్సీ నోట్లను బిస్కట్లలా నమిలి మింగేసింది ఆ కుక్క! బ్రిటన్ కు చెందిన జాక్వెలిన్ హార్న్ అనే గృహిణి ఓ కుక్కను పెంచుకుంటోంది. ఒక రోజు ఆఫీసునుంచి ఇంటికి వచ్చిన జాక్వెలిన్ కు ఎక్కడో కరకరమంటూ నములుతున్న శబ్దం వినిపించింది. ఏమిటా అని చూస్తే, తన పెంపుడు కుక్క తీరిగ్గా కూర్చుని, కరెన్సీ నోట్లను నమిలి మింగేస్తోందట! జాక్వెలిన్ లబోదిబోమంటూ కుక్కకు రెండు తగిలించి చూస్తే ఏముంది… ఇల్లంతా సగం నమిలేసిన నోట్లే. బెడ్రూమ్ లోనూ, కిచెన్ లోనూ కూడా చిరిగిపోయిన నోట్లు కనిపించేసరికి జాక్వెలిన్ తల పట్టుకుని కూలబడిపోయింది.

జాక్వెలిన్ తన ఇంట్లోని ఓ గదిలో పెట్టెలో డబ్బు దాచి పెడుతుందట. ఆ గదిలోకి పెంపుడు కుక్కను రానివ్వదు. కానీ, అది ఎలా జొరబడిందో గానీ, పెట్టె మూతను మూతితో  పైకెత్తి అందులోని నోట్లను నమిలి మింగేసింది. మరి కొన్నింటిని చింపేసి, ఇల్లంతా పడేసింది! సుమారు పది వేల రూపాయల విలువైన నోట్లను కుక్క తినేసినట్లు జాక్వెలిన్ చెబుతోంది!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News