Monday, December 23, 2024

యజమాని కోసం ఎంత పని చేసింది… శునకాన్ని మెచ్చుకోవాల్సిందే

- Advertisement -
- Advertisement -

బెల్‌ఫాస్ట్: యజమానులపై శునకాలకు ఉండే అ పార ప్రేమ, విశ్వాసాన్ని చాటిచెప్పే ఉదంతం ఉ త్తర ఐర్లాండ్‌లో జరిగింది. కూపర్ అనే గోల్డెన్ రీట్రీవర్ జాతికి చెందిన శునకాన్ని యజమానికి తప్పని పరిస్థితుల్లో వదులుకున్నాడు. కొ త్త ఇంటికి చేరుకున్న కూపర్ తన పాత యజమానిపై ఉన్న విశ్వాసంతో ఒంటరిగా ప్రయాణించింది. మెట్రో వార్తాసంస్థ క థనం ప్రకారం కూపర్‌ను కొత్త ఇంటికి కారులో తీసుకువెళుతుండగా కారులో నుంచి దూకి త ప్పించుకుంది. తిరిగి తన పాత యజమాని ఇం టికి చేరుకునేందుకు 27 రోజుల పాటు 64కిలోమీటర్లు ఒంటరిగా ప్రయాణించింది.

Also Read: అతడికి 65… ఆమెకు 16… అత్తకు పదోన్నతి

ప్రధాన ర హదారికి ఆనుకుని ఉన్న చెక్కల వెనుక నుంచి తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. ఎవరి సా యం లేకుండానే పయనించిన కూపర్ ఎక్కువ గా రాత్రి సమయాల్లోనే తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఆహారం, వసతి, ఎటువంటి సా యం లేకపోయినా కూపర్ పయనించిందని స్ట్ పాస్ ఎన్‌ఐ అనే సంస్థ ప్రతినిధి తెలిపారు. త ప్పిపోయిన పెంపుడు జంతువులు, పక్షులను తి రిగి యజమానుల చెంతకు చేర్చేందుకు లాస్ట్ పాస్ ఎన్‌ఐ సంస్థ కృషి చేస్తోంది. ఈ సంస్థ సా యంతో కూపర్ తన కొత్త యజమాని జంతుప్రేమికుడైన నీగల్ నివాసానికి చేరుకుంది. ప్రస్తు తం కూపర్ క్షేమంగా ఉందని నీగల్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News