- Advertisement -
న్యూయార్క్: విమానంలో కుక్కతో కలిసి ఎక్కనివ్వలేదని కుక్కను చంపి అనంతరం ఆమె విమానం ఎక్కి వెళ్లిపోయింది. దీంతో ఆమెను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సంఘటన అమెరికాలోని ఫ్లోరిడా విమానాశ్రయంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అలిసన్ లారెన్స్(57) అనే ప్రయాణికురాలి ఫ్లోరిడా విమానాశ్రయంలోకి వెళ్లగానే కుక్కను తీసుకెళ్లడానికి సరైన పత్రాలు లేవని సిబ్బంది ఆపారు.
ఏమీ చేయాలో తోచక కుక్కను బాత్రమ్ కు తీసుకెళ్లి నీళ్లలో ముంచి చంపేసి బస్తాలో మూటకట్టి వెళ్లిపోయింది. అనంతరం విమానం ఎక్కి వెళ్లిపోయింది. సిబ్బంది గమనించి కుక్క కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. కుక్క మెడపట్టిపై యజమానురాలు పేరు, ఫోన్ నంబర్ ఉండడంతో ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకుంది. జంతుహింస నేరం కింద ఆమెను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
- Advertisement -