Thursday, December 26, 2024

కారుపైన శునకం.. నెటిజన్ల ఆగ్రహం (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: చిత్ర విచిత్రాలతో కూడిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. కొన్ని సరదాగా నవ్వు పుట్టించేవిగా ఉంటే కొన్ని నెటిజన్ల ఆగ్రహాన్ని చవిచూస్తుంటాయి. అలాంటిదే ఒక వీడియో తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బెంగళూరు రోడ్లపై కారుపై కూర్చుని షికారు చేస్తున్న వీడియో ఒకటి ఫరెవర్ బెంగళూరు అకౌంట్ ద్వారా ట్విటర్‌లో షేర్ అయింది. జస్ట్ బెంగళూరు థింగ్స్ అని దీనికి క్యాప్షన్ రాసి ఉంది. వేగంగా వెళుతున్న కారుపై ఒక శునకం కూర్చుని ఉన్న దృశ్యం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియోను ఇప్పటివరకు లక్షా 50 వేల మంది వీక్షించారు.

అయితే ఈ వీడియో చాలా మంది నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. ఇది జంతువుల హక్కులను హరించడమేనని, నేరానికి పాల్పడిన వారిని శిక్షించాలని కోరుతూ కొందరు నెటిజన్లు పేటాను ట్యాగ్ చేస్తూ కామెంట్లు చేశారు. కొందరు మాత్రం ఇది దీన్ని ఫన్నీ వీడియోగా అభివర్ణించారు. అయితే ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించే ఇలాంటి ఫీట్లు చేయడం తప్పంటూ కొందరు చెప్పగా మరికొందరు కారు నంబర్ ఆధారంగా చేసుకుని పోలీసులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News