Thursday, January 23, 2025

కుక్కతో పాప బంతి ఆట… వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓ పాప కుక్కతో ఆడిన బంతి ఆట వైరల్‌గా మారింది. గేట్ లోపల కుక్క ఉంది బయటక పాప ఉంది. బంతి విసరగానే కుక్క నోటితో అందుకోవడంతో పాప ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. కుక్క తన నోటీతో బంతి పట్టుకున్న ప్రతి సారి పాప ఆనందాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్య పోయారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియా, యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను 6.4 లక్షల మంది వీక్షించగా 84000 మంది లైక్ చేశారు. కుక్కలకు గొప్ప ఆత్మ ఉంటుందని, కుక్కకు ధన, పేద అనే తేడాలను తెలియని అపురూపమైన జంతువు అని నెటిజన్ ప్రశంసించారు. కుక్క విశ్వాసానికి మారు పేరు అనే మరో నెటిజన్ కామెంట్ చేశాడు. కుక్క, పాప కలిసి ఆడుకోవడం అద్భుతంగా ఉందని, దేవడు ఇద్దరిని దీవిస్తాడని, ఇద్దరికి ప్రేమ పూర్వకంగా అభినందనలు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News