Sunday, January 19, 2025

ఢిల్లీలో వేటకుక్క గుండెకు కోతలేని శస్త్రచికిత్స

- Advertisement -
- Advertisement -

సంక్లిష్ట గుండె పరిస్థితిని ఎదుర్కొంటున్న ఏడేళ్ల వేటకుక్కకు ఢిల్లీలోని ప్రైవేట్ వెటర్నరీ ఆస్పత్రిలో మొట్టమొదటిసారి కోతలేని శస్త్రచికిత్స చేసి విజయం సాధించారు. ఈ అపూర్వశస్త్రచికిత్స జరగడం భారత ఉపఖండం లోనే మొదటిసారి. ఏడేళ్ల వేటకుక్క “ జులియెట్ ”మిట్రల్ వాల్వ్ ( గుండె లోని ఎడమ కర్ణిక ) వ్యాధితో గత రెండేళ్లుగా బాధపడుతోంది. చిన్న జంతువులకు శస్త్ర చికిత్సలో నైపుణ్యం కలిగిన ఇంటర్‌వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ భానుదేవ్ శర్మ ఈస్ట్ ఆఫ్ కైలాష్‌లో మాక్స్ పెజ్ ఆస్పత్రిలో ఈ శస్త్రచికిత్స నిర్వహించారు. గుండె లోని మిట్రల్ వాల్వ్‌లో రక్తప్రవాహం సరిగ్గా లేక ఊపిరితిత్తుల్లో ద్రవం పేరుకుపోయి ప్రమాద పరిస్థితి ఏర్పడడంతో ట్రాన్స్‌కెథటెర్ ఎడ్జ్ టు ఎడ్జ్ రిపైర్ ( టిఇఇఆర్) అనే హైబ్రిడ్ సర్జరీని మే 30న నిర్వహించారు.

ఓపెన్ హార్ట్ సర్జరీ లేకపోవడం దీని ప్రత్యేకత. అమెరికా లోని కొలొరాడో స్టేట్ యూనివర్శిటీలో రెండేళ్ల క్రితం ఈ కోతలేని శస్త్రచికిత్స విధానాన్ని డాక్టర్ శర్మ బృందం అధ్యయనం చేసింది.ఈ బృందం గత ఏడాది షాంఘై కూడా వెళ్లి ఈ విధానాన్ని నేర్చుకున్నారు. శస్త్ర చికిత్స అయిన తరువాత రెండు రోజులకు ఈ జాగిలాన్ని డిశ్చార్జి చేశారు. భారత దేశంలో మిట్రల్ వాల్వ్ వ్యాధి కుక్కల్లో సాధారణం. 80 శాతం కుక్కలకు ఈ వ్యాధి వస్తుంటుంది. కుక్కలు చనిపోడానికి ప్రధాన కారణాల్లో ఈ వ్యాధి ఒకటి. ప్రపంచం లోని చాలా తక్కువ కేంద్రాల్లోనే ఈ సర్జరీ నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News