Wednesday, January 22, 2025

డాగీ డాబా..ఇక్కడ శునకాలకే ప్రవేశం (స్పెషల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: శునక ప్రేమికులకు ఇది శుభవార్తే..ఇంట్లో శునకాన్ని పెంచుకునే వారు తమ సొంత పిల్లలను ఎలా చూసుకుంటారో వాటిని కూడా అలానే చూసుకోవాలను కుంటారు. వాటికి మంచి ఆహారాన్ని అందచేయడం తమ బాధ్యతగా భావిస్తారు. వాటిని వాకింగ్ కూడా తీసుకువెళతారు. అయితే తమ కుటుంబంతోపాటు రెస్టారెంట్‌కు తీసుకు వెళ్లడంలోనే ఇబ్బంది వస్తుంటుంది. శునకాలకు చాలా రెస్టారెంట్లలో ప్రవేశం ఉండదు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి..డాగ్ లవర్‌గా బల్‌రాజ్ ఝాలాకు కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. అందుకు తానే పరిష్కారం కనుగొన్నాడు. తన భార్యతో కలసి శునకాల కోసం ప్రత్యేకంగా డాగీ డాబా తెరిచాడు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో ఏర్పాటైన ఈ విలక్షణమైన డాబా శునక ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తమ పెంపుడు శునకాలను వెంటపెట్టుకుని ఈ డాబాకు విచ్చేస్తున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ డాబాలో శునకాల కోసం ప్రత్యేకమైన, రుచికరమైన ఆహారం లభిస్తుంది. శునకాల బర్త్‌డే పార్టీలను కూడా ఇక్కడ చేసుకోవచ్చు. వాటికి ప్రత్యేకమైన కేక్‌లు కూడా తయారుచేస్తున్నారు.

రోజుకు రూ. ఒక్కో డాగ్ మీల్‌కు రూ. 7 నుంచి రూ. 500 వరకు చార్జ్ చేస్తున్నట్లు బల్‌రాజ్ చెబుతున్నాడు. శునకాలకు బోర్డింగ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నాడు. ఎవరైనా బయట ఊళ్లకు వెళితే తమ పెంపుడు శునకాన్ని ఇక్కడ వదిలిపెట్టి హ్యాపీగా వెళ్లిరావచ్చు. దానికి కూడా నామినల్‌గా చార్జ్ చేస్తున్నట్లు బల్‌రాజ్ చెప్పాడు. గతంలో తాను ఒక హోటల్‌లో పనిచేసేవాడినని, లాక్‌డౌన్ కాలంలో వీధి కుక్కలు తిండిలేక అలమటించిన దుస్థితి చూసి చలించిపోయి తాను ఈ డాగీ డాబా ప్రారంభించానని అతను తెలిపాడు. ఏదేమైనా ఇలాంటి వినూత్న ఆలోచనను కార్యరూపంలో పెట్టిన బలరాజ్‌ను అభినందించాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News