Monday, December 23, 2024

కుక్కల దాడిలో జింకకు గాయాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ ముథోల్ : నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలో బుధవారం కుక్కల దాడిలో జింకకు గాయాలయ్యాయి. అడవి నుండి గ్రామంలో ప్రవేశించిన జింకపై కుక్కలు దాడి చేసిన విషయం గమనించి తరిమి వేశారు. అనంతరం పశువైద్య అధికారులకు సమాచారం అందించి జింకకు ప్రథమ చికిత్స చేశారు. స్థానికులు ముథోల్ ఎస్‌ఐ తిరుపతికి సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులకు జింకను అప్పగించినట్టు ఎస్ఐ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News