Saturday, December 21, 2024

బోధన్ బస్టాండ్ లో బాలుడిని పీక్కుతిన్న కుక్కలు?

- Advertisement -
- Advertisement -

బోధన్: వీధి కుక్కలు 10 నెలల బాలుడిపై దాడి చేసి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా పీక్కుతిన్న సంఘటన  నిజామాబాద్  జిల్లా బోధన్ బస్టాండ్ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. 2 రోజుల క్రితం ఓ తల్లి తన 10 నెలల బిడ్డను వదిలి మూత్రశాలకు వెళ్లింది. తిరిగివచ్చి చూసేసరికి బాలుడు కనిపించలేదు. పరిసరాలను వెతికిన  ఎక్కడా బిడ్డ కనిపించకపోవడంతో  ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి బిడ్డ కోసం గాలింపు చర్యలు చేపట్టగా చెట్ల పొదల్లో బాలుడి శరీర భాగాలు కనిపించాయని పోలీసులు వెల్లడించారు.  శరీర భాగాలు బాలుడిదిగా గుర్తించామని ఎస్ఐ తెలిపారు. శరీర భాగాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టు మార్టమ్ రిపోర్టు వచ్చి తరువాత నిజాలు బయటకు వస్తాయని స్థానిక ఎస్ఐ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News