Monday, January 20, 2025

కుక్క పిల్లల పెళ్లి….. ఊరంతా హడావుడి (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

 

న్యూస్ డెస్క్: పెంపుడు జంతువులను తమ కుటుంబ సభ్యులలో ఒకరిగా భావించే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వాటి అచ్చటా ముచ్చటా తీర్చి సంతోషపడే వారు కూడా చాలామందే ఉన్నారు అలాంటి సంఘటనే ఇది. తమ ఇంట్లో పెరుగుతున్న కుక్క పిల్లకు అత్యంత వైభవంగా పెళ్లి చేసి కూతురి పెళ్లి చేసిన ముచ్చట కూడా తీర్చుకున్నదో కుటుంబం. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

హరీందర్ సింగ్ అనే వ్యక్తి ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ పెళ్లి దృశ్యాలు నెటిజన్ల మనసును దోచుకుంటున్నాయి. ఆడ పెళ్లివారింటికి వరుడి వేషధారణలో రిమోట్ బ్యాటరీ కారులో మగ కుక్కపిల్ల ప్రవేశించడంతో వీడియో మొదలవుతోంది. దుపట్టా కప్పుకున్న ఆడ కుక్కపిల్లను వధువుగా ఒక యువకుడు ఎత్తుకుని తీసుకు వస్తాడు.

వధువు తరఫు బంధువులు ఊరేగింపుగా బ్యాండు మేళంతో నృత్యం చేసుకుంటూ వస్తుంటారు. రెండు కుక్క పిల్లలకు పెళ్లి తంతు సంప్రదాయ రీతిలో జరుగుతుంది. ట్విటర్‌లో షేర్ చేసిన నాటి నుంచి ఈ వీడియోను దాదాపు 30వేల మంది వీక్షించారు. ఈ పెళ్లి ఆర్భాటంపై కొందరు నెటిజన్లు విమర్శలు కూడా గుప్పించారు. ఇంత ఖర్చు అవసరమా అని కొందరు వ్యాఖ్యలు చేయగా పెంపుడు జంతువుల పట్ల తమ ప్రేమను చాటుకున్న ఆ కుటుంబాన్ని పలువురు నెటిజన్లు అభినందిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News