Thursday, January 23, 2025

రూ.118 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి చంద్రబాబు: డొక్కా

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఐటి నోటీసులపై మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడటం లేదని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ నిలదీశారు. ప్రభుత్వ సంస్థ ఆర్థిక లావాదేవీల గురించి అడిగితే ఎందుకు చెప్పడం లేదని అడిగారు. రూ.118 కోట్లు అక్రమ మార్గంలో చేరాయని ఐటి స్పష్టం చేసిందని, టెక్నికల్ అంశాలను అడ్డుపెట్టుకొని తప్పించుకోవాలని చూస్తున్నారేగానీ ఆ డబ్బు తనకు ఎలా వచ్చిందో బాబు చెప్పడం లేదని డొక్కా చురకలంటించారు. మనోజ్ వాసుదేవ్ స్పష్టంగా బాబు డబ్బు ఎలా చేరిందో ఐటికి చెప్పాలని, చిన్న చిన్న విషయాలకే హడావుడి చేసే ఎల్లో మీడియా ఎందుకు మాట్లాడటం లేదని, చర్చోపచర్చలు చేసే ఎల్లో మీడియా ఐటి నోటీసులపై ఎందుకు స్పందించడం లేదని డొక్కా మండిపడ్డారు. చంద్రబాబు కొట్టేసిన నగదుపై చర్చ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో నిందితులందరిని ఐటి శాఖ కస్టడీలోకి తీసుకొని విచారించాలన్నారు. ఐటి నోటీసులపై సిబిఐ కూడా విచారణ జరపాలన్నారు.

Also Read: యుపిఐ క్యుఆర్ కోడ్ అడిగిన కస్టమర్‌కు ఆ మహిళ ఇచ్చిన రియాక్షన్(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News