- Advertisement -
ముంబై : బుధవారం నుంచి ముంబై నగర విమానాశ్రయం టెర్మినల్ 1 లో ఐదు డొమెస్టిక్ ఎయిర్‌లైన్ సర్వీసులు మళ్లీ ప్రారంభమౌతాయని మొత్తం 102 విమానాలు 27 గమ్యస్థానాలకు చేరతాయని సిటీ ఎయిర్ పోర్టు వెల్లడించింది. దేశంలో మిగతా చోట్ల మే 25 నుంచి విమాన సర్వీసులు ప్రారంభమైనప్పటికీ ఇక్కడ మాత్రం కరోనా దృష్టా మార్చి నుంచి సర్వీసులను రద్దు చేశారు. ప్రస్తుతం ముంబై విమానాశ్రయం నుంచి అన్ని డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సర్వీసులన్నీ టెర్మినల్ 2 నుంచి నడుస్తున్నాయి. టెర్మినల్ 1 నుంచి డొమెస్టిక్ సర్వీసులు ప్రారంభించడం వల్ల సామాజిక దూరం నిబంధనలు పాటించి ప్రయాణికులను పరీక్షించడానికి, భద్రత చేకూర్చడానికి వీలౌతుందని ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేసనల ఎయిర్ పోర్టు సోమవారం ప్రకటనలో తెలిపింది.
- Advertisement -