Monday, January 20, 2025

కోలుకుంటున్న విమానయానం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశీయ విమానయాన రంగం కోలుకుంటోంది. కొద్ది నెలలుగా భారతదేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆగస్టు నెలలో విమాన ప్రయాణికులు వార్షిక ప్రాతిపదికన 23 శాతం పెరిగారు, అంటే గత నెలలో మొత్తం 1.24 కోట్ల మంది ప్రయాణికులు విమానంలో ప్రయాణించారు. గతేడాది అంటే 2022 ఆగస్టులో ఈ సంఖ్య 1.01 కోట్లుగా ఉంది. అయితే విమాన ఇంధనం అంటే ఎటిఎఫ్ ధరలు 3 సంవత్సరాలలో 90 శాతం పెరిగాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) తాజా నివేదికను విడుదల చేసింది. నివేదిక ప్రకారం, ఈ ఏడాది జనవరి-ఆగస్టు మధ్య కాలంలో దేశీయ మార్గాల్లో ఇప్పటివరకు 10.06 కోట్ల మంది ప్రయాణికులు విమాన ప్రయాణం చేశారు. జనవరి-ఆగస్టు 22 మధ్య ఈ సంఖ్య 7.7 కోట్లుగా ఉంది. అంటే దేశీయ మార్గాల్లో ట్రాఫిక్ ఈ సంవత్సరం ఇప్పటివరకు 30 శాతానికి పైగా ఉంది.

92 లక్షల మంది విమాన ప్రయాణికులు అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించారు. ప్రీ-కోవిడ్ స్థాయి అంటే 2019తో పోలిస్తే ఇది 27 శాతం పెరిగింది. ఆగస్టు నెల ప్రయాణికుల సంఖ్యలో కూడా ఎయిర్‌లైన్స్ కంపెనీ ఇండిగో విజయం సాధించింది. 2023 ఆగస్టులో ఇండిగో ద్వారా మొత్తం 78.67 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఈ ఎయిర్‌లైన్ మొత్తం మార్కెట్ వాటా 63.3 శాతంగా ఉంది. జూలై 2023లో ఇండిగో వాటా 63.4 శాతం ఉంది. కోవిడ్‌కు ముందు కంటే ఇప్పుడు విమాన ప్రయాణికులు 6 శాతం పెరిగింది. ఏప్రిల్-ఆగస్టులో 6.31 కోట్ల మంది విమాన ప్రయాణికులు ఉన్నారు. వార్షిక ప్రాతిపదికన ఇది 20 శాతం వృద్ధిని నమోదు చేసింది. విమాన ఇంధన(ఎటిఎఫ్) ధరలు ప్రస్తుతం కిలోలీటర్‌కు రూ.1.21 లక్షలుగా ఉన్నాయి. 2020తో పోలిస్తే ఎటిఎఫ్ ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. అప్పట్లో ఎటిఎఫ్ ధర కిలో రూ.64 వేలుగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News