Monday, December 23, 2024

మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..

- Advertisement -
- Advertisement -

Domestic Gas Cylinder price hiked by Rs 3.50

న్యూఢిల్లీ: గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. తాజాగా డొమెస్టిక్ గ్యాస్‌ సిలిండర్ పై రూ.3.50, కమర్షియల్ సిలిండర్‌పై రూ.8 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ధరల సవరణలో భాగంగా వంట గ్యాస్ సిలిండర్ ధరను పెంచినట్లు పేర్కొన్నాయి. దీంతో సామాన్యుడి నెత్తిపై మళ్లీ వంటగ్యాస్ ‘బాదుడు’ భారం పడింది. తాజా పెంపుతో  దేశంలోని అన్ని నగరాల్లో వంట గ్యాస్ సిలిండర్‌ ధర వెయ్యి రూపాయలు దాటింది.దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కేజీల సిలిండర్ ధర రూ.1,003, కోల్‌కతాలో రూ.1,029, చెన్నైలో రూ.1,018, హైదరాబాద్‌లో 1,057కు సిలిండర్ ధర చేరుకుంది. పెరిగిన ధరలు ఈరోజు నుంచి అమలులోకి రానున్నాయి. ఈ నెలలో వంట గ్యాస్ ధర పెంచడం ఇది రెండోసారి. దీంతో సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Domestic Gas Cylinder price hiked by Rs 3.50

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News