Sunday, December 22, 2024

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు!

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు వారాంతంలో లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు కూడా తోడ్పడ్డాయి. ఉదయం సూచీలు లాభనష్టాల మధ్య కదలాడినప్పటికీ చివరికి కొనుగోళ్ల మద్దతు లభించడంతో లాభాల్లో ముగిశాయి.

సెన్సెక్స్ 463.06 పాయింట్లు లేక 0.76 శాతం లాభపడి 61112.44 వద్ద, నిఫ్టీ 150 పాయింట్లు లేక 0.84 శాతం లాభపడి 18065 వద్ద ముగిసింది. 2167 షేర్లు లాభపడగా, 1238 షేర్లు నష్టపోయాయి. 128 షేర్లు ఎలాంటి మార్పు లేకుండా యథాతథంగా ముగిశాయి. నిఫ్టీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్, బ్రిటానియా ఇండస్ట్రీస్, విప్రో, నెస్లే ఇండియా ప్రధానంగా లాభపడగా, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్‌జిసి, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, జెఎస్‌డబ్లు, టైటాన్ కంపెనీ షేర్లు నష్టపోయాయి. క్యాపిటల్ గూడ్స్, ఇన్‌ఫ్రా, పవర్, పిఎస్‌యూ బ్యాంక్, ఐటి వంటి అన్ని రంగాల షేర్లు గ్రీన్‌లోనే ముగిశాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 59920.00 ట్రేడయింది. అమెరికా డాలరు మారకం రేటు రూ. 81.83 వద్ద ట్రేడయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News