ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం నష్టాల్లో ముగిసింది. బ్యాంకు, రియాల్టీ, ఐటీ షేర్లు ప్రధానంగా నష్టాలకు కారకం అయ్యాయి. సెన్సెక్స్ 390.58 పాయింట్లు లేదా 0.68% క్షీణించి 57,235.33 వద్ద, నిఫ్టీ 109.30 పాయింట్లు లేదా 0.64% క్షీణించి 17,014.30 వద్ద ముగిశాయి. దాదాపు 1283 షేర్లు పురోగమించగా, 2054 షేర్లు తిరోగమించాయి , కాగా 130 షేర్లు మారలేదు.
విప్రో, అదానీ పోర్ట్స్, ఎస్‌బిఐ, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎల్ అండ్ టి టాప్ నిఫ్టీ నష్టపోయిన వాటిలో ఉన్నాయి. హెచ్‌సిఎల్ టెక్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, బ్రిటానియా, టాటా మోటార్స్ ప్రధానంగా లాభపడ్డాయి. కాగా మెటల్ , హెల్త్‌కేర్ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బిఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున క్షీణించాయి. రిటైల్ ఇన్ ఫ్లేషన్ ఇంకా కొనసాగడం మార్కెట్ పతనానికి కారణం.