ముంబై: నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. మదుపరులు డిసెంబర్ 11న వెలువడనున్న అమెరికా వినియోగదారు ధర ద్రవ్యోల్బణం(సిపిఐ) డేటా కోసం ఎదురుచూస్తున్నారు. ఇండియా సిపిఐ డేటా కూడా డిసెంబర్ 12న వెలువడనున్నది. నేడు గోద్రెజ్ కన్జూమర్స్ షేర్ల ధర బాగా పడిపోయింది. డిసెంబర్ త్రైమాసికం అమ్మకాల ఫోర్ కాస్ట్ బలహీనంగా ఉండడమే అందుకు కారణం.
మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 200.7 పాయింట్లు లేక 0.3 శాతం పతనం అయి 81508.5 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 58.8 పాయింట్లు లేక 0.2 శాతం పతనమై 24619 వద్ద ముగిసింది. 2222 షేర్లు లాభపడగా, 1692 షేర్లు నష్టపోయాయి, 151 షేర్లు ఎలాంటి మార్పు లేకుండా ముగిశాయి. నిఫ్టీలో విప్రో, ఎల్ టి, ఎస్ బిఐలైఫ్, టాటాస్టీల్, బిపిసిఎల్ షేర్లు ప్రధానంగా లాభపడగా, టాటాకన్జూమర్స్, హిందుస్థాన్ యూనీలీవర్, టాటా మోటార్స్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్ ప్రధానంగా నష్టపోయాయి.