Monday, December 23, 2024

నష్టాల్లో ముగిసిన సూచీలు

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాల్లో ముగిశాయి. నిన్న బడ్జెట్ లో ప్రతిపాదించిన స్వల్పకాలిక, దీర్ఘకాలిక పన్ను ప్రభావం బుధవారం స్టాక్  మార్కెట్ మీద చూయించింది. దానికి తోడు అంతర్జాతీయ మార్కెట్ ప్రతికూల సంకేతాలు తోడయ్యాయి. సెన్సెక్స్ 280.16 పాయింట్లు లేక 0.34 శాతం నష్టపోయి 80148.88 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 65.55 పాయింట్లు లేక 0.27 శాతం నష్టపోయి 24413.50 వద్ద ముగిసింది. సెన్సెక్స్ వరుసగా నాలుగో రోజు (సెషన్)నష్టపోయింది.

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో నేడు ఎంఎంటిసి, అవంతి ఫీడ్స్, ఐడిబిఐ బ్యాంక్, కాస్ట్రోల్ ఇండియా షేర్లు ప్రధానంగా లాభపడగా, ఫోనిక్స్ మిల్స్, గోద్రేజ్ కన్జూమర్, బంధన్ బ్యాంక్, సుమిటోమో కెమికల్ ఇండియా షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.

ఎంఎంటిసి(MMTC) స్టాక్ నేడు అప్పర్ సర్క్యూట్ ను(రూ.102.60) కూడా తాకి నిలిచిపోయింది. బయ్యర్స్ తప్ప సెల్లర్స్ లేకుండా పోయారు. దీనిని మల్టీబ్యాగర్ స్టాక్ అని కూడా అనవచ్చు. ఎందుకంటే దీని అసలు ధర కంటే అతి తక్కువ కాలంలో అనేక రెట్లు లాభాన్ని ఇస్తుంది. పైగా ఇది హై రిస్క్ ప్రొడక్ట్. నేడు ఒక్క రోజులోనే 20% పెరిగింది. అంటే రూ. 84.90(అత్యల్పం) నుంచి రూ. 102.60(గరిష్ఠం)ను తాకింది. ఎంఎంటిసి ముఖ విలువ(ఫేస్ వ్యాల్యూ రూ. 1), పి/ఈ 225.64, పి/బి 11.36, మొత్తం షేర్లు 150 కోట్లు, ఈపిఎస్ రూ. 0.45, ఆర్ఓసిఈ 68.68%. సేల్స్ -96.75%, ప్రాఫిట్ గ్రోత్ 552.57%, డెట్ రూ. 42.73 కోట్లు., మార్కెట్ క్యాపిటల్ రూ. 15390 కోట్లు. దీని ఆర్ఓఈ 147.59 %, బుక్ వ్యాల్యూ (టిటిఎం) రూ. 9.03 మాత్రమే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News