Tuesday, January 7, 2025

నేడు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

- Advertisement -
- Advertisement -

ముంబై: నేడు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్ర ఊగిసలాటకు లోనయి చివరికి నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో నేటి ట్రేడింగ్ ఉత్సాహంగా ప్రారంభమయినప్పటికీ చివరికి నష్టాల్లో ముగిసింది. ఎన్ఎస్ఈలో బజాజ్ ఆటో, హెచ్ డిఎఫ్ సి బ్యాంక్, ఏసియన్ పెయింట్, ఎం అండ్ ఎం, ఐషర్ మోటర్స్ షేర్లు ప్రధానంగా లాభపడగా, టాటా కన్జూమర్, కొటక్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్,  బిపిసిఎల్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.

నేడు సెన్సెక్స్ 73.48 పాయింట్లు లేక 0.09 శాతం నష్టపోయి 81151.27 వద్ద ముగిసింది, ఇక నిఫ్టీ 72.96 పాయింట్లు లేక 0.29 శాతం నష్టపోయి 24781.10 వద్ద ముగిసింది. ఇక 2902 స్టాకులు ట్రేడవ్వగా, 695 లాభపడ్డాయి, 2120 నష్టపోయాయి, 87 మార్పు లేకుండా ముగిశాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News