Monday, December 23, 2024

ఆఖర్లో కొనుగోళ్లతో రికవరీ అయిన స్టాక్ మార్కెట్!

- Advertisement -
- Advertisement -

ముంబై: నేడు దేశీయ స్టాక్ మార్కెట్ రోజంతా తీవ్ర ఒడుదొడుకులకు లోనయినప్పటికీ చివరికి కొనుగోళ్ల సపోర్టుతో పుంజుకుంది. ఎఫ్‌ఎంజిసి, ఆటో స్టాకుల్లో లాభాలు మార్కెట్ పుంజుకోడానికి తోడ్ప డ్డాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 98.84 పాయింట్లు లేక 0.16 శాతం పెరిగి 61872.62 వద్ద, నిఫ్టీ 35.80 పాయింట్లు లేక 0.20 శాతం పెరిగి 18321.20 వద్ద ముగిసింది. మొదట్లో ప్రపంచ మార్కెట్ ప్రభావంతో నెగటివ్‌గా మార్కెట్ మొదలయింది. సమయం గడిచే కొద్దీ కొద్దికొద్దిగా పుంజుకుంది. కనాఈ చివరి గంటలో ఆటో, ఎఫ్‌ఎంజిసి, రియాల్టీ సూచీల షేర్లలో కొనుగోళ్లు ఉదృతం కావడంతో మార్కెట్ స్మార్ట్‌గా మూవ్ అయింది.
నిఫ్టీలో బజాజ్ ఆటో, అదానీ ఎంటర్‌ప్రైజెస్, భారతీ ఎయిర్‌టెట్, ఐటిసి, దివీస్ లాబొరేటరీస్ ప్రధానంగా లాభపడగా, విప్రో, టాటా మోటార్స్, యుపిఎల్, సన్‌ఫార్మ, హెచ్‌డిఎఫ్‌సి నష్టపోయాయి. మెటల్, పిఎస్‌యూ బ్యాంక్ రంగాలు తప్పించి మిగతా అన్ని రంగాలు లాభాల్లో ముగిశాయి. రియాల్టీ ఒక శాతం, ఆటో, కెపిటట్ గూడ్స్, ఎఫ్‌ఎంసిజి, పవర్ రంగం షేర్లు 0.5 శాతం లాభపడ్డాయి. బిగ్గెస్ట్ గెయినర్‌గా బజాజ్ ఆటో, బిగ్గెస్ట్ లూజర్‌గా విప్రో నిలిచాయి. వాల్యూమ్ పరంగా చూసినప్పుడు ఇండియాబుల్స్ హౌజింగ్ ఫైనాన్స్, డెల్టా కార్ప్, ఒబెరాయ్ రియాల్టీ షేర్లలో 100 శాతం కన్నా వృద్ధి కనిపించింది. వంద కన్నా ఎక్కువ స్టాకులు 52 వారాల గరిషాన్ని తాకాయి. వాటిలో బ్రిటానియా ఇండస్ట్రీస్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఐడిఎఫ్‌సి, సియట్, డేల్టా కార్ప్, అపోలో టైర్స్, గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్, స్టార్ సిమెంట్, వండరెల్లా హాలీడేస్ ఉన్నాయి. నిఫ్టీ మళ్లీ 18400- 18450 లెవల్స్‌ను తాకొచ్చనిపిస్తోంది. ఇదిలావుండగా స్వచ్ఛ బంగారం(24 క్యారట్లు) 10 గ్రాముల ధర రూ.350.00 లేక 0.58 శాతం తగ్గి రూ. 59526.00 వద్ద ట్రేడయింది. కాగా అమెరికా డాలరు మారకం రేటు రూపాయిల్లో 0.06 పైసలు లేక (0.07 శాతం) లాభపడి రూ. 82.74 వద్ద ట్రేడయింది.
ఇక ఆప్షన్స్ అండ్ ఫూచర్స్ విషయానికి వస్తే జూబిలియంట్ ఫుడ్ వర్క్, కమ్మిన్స్ ఇండియా, ఇండస్ టవర్స్‌లో లాంగ్ బిల్డప్ కనిపించింది. అలాగే టాటా కెమికల్స్, ఇండియా సిమెంట్స్, అశోక్ లీలాండ్‌లో షార్ట్ బిల్డప్ కనిపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News